వజ్రపు తల్లిరాయి--డాక్టర్ కందేపి రాణి ప్రసాద్

దేశానికి జెండాను ఇచ్చిన వీరుడు
దేశ భక్తిని నర నరానా నింపుకున్న శూరుడు
ధైర్య సహసాలతో దూసుకెళ్లే ధీరుడు
దక్షిణాఫ్రికా యుద్ధం లో పాల్గొన్న యోధుడు


కాషాయ రంగుతో హిందువులను కూర్చి
ఆకుపచ్చతో  మూసిమూలను మేలపించి
కలకాలం కలిసి మెలిసి ఉండలాని తలంచి
అహింస తెలుపును మధ్యలో నిలబెట్టి (ఇరికించి)


కొలంబోకు ఉన్నత చదువులకు వెళ్ళి
ఉద్విగ్రత తో సమార సైన్యంలో చేరి
కొన్నాళ్లు ప్లేగ్ ఇన్స్పెక్టర్ గా పని చేసి
ఉద్యమంలో ప్రధాన పాత్ర దారిగా మారి


కం బొడియా పత్తి పై విశేష కృషి చేసి
పత్తి వెంకయ్య పేరు పొందిన శాస్త్రవేత్త 
కాలేజ్ బోధకుడై విదేశీ భాషల్లో మాట్లాడే
పదగామి వజ్రపు తల్లిరాయి గ్రంథకర్త!


కామెంట్‌లు