దగ్గు, జలుబు, గొంతులో గర గర -పి. కమలాకర్ రావు

కొన్ని తమలపాకులను ముక్కలుగా త్రుంచి నీటిలో వేసి అందులో కొన్ని మిరియాలు యాలకులు జిలకర లవంగాలు వేసి మరిగించి చల్లార్చి కషాయాన్ని తాగితే దగ్గు జలుబు తగ్గిపోతుంది. ముల్లంగిని తెచ్చి బాగా కడిగి ముక్కలు కోసి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. గిన్నెలో వేసి నీరు పోసి అందులో తాటి బెల్లం లేదా బెల్లం వేసి మరిగించి కషాయం  చేసి చల్లార్చి త్రాగాలి.  దగ్గు జలుబు గొంతులో గర గర తగ్గిపోతుంది. ముల్లంగి లో గంధక తత్వం మరియు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ.


కామెంట్‌లు