బొమ్మాలమ్మా ..బొమ్మలూ ..--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్.

ఆటలు ఆడి 
పాటలు పాడి 
ఆటల మద్యలో
అలకలు పోయి
అల్లరి చేసి ...


అలసిపోయిన 
పిల్లల్లారా ...
పాపల్లారా ...
రండర్రా ..రారండి ,


అమ్మ పెట్టిన 
బొమ్మల కొలువు
అనందంగా ..
చూడగారండి !


బొమ్మలంటే బొమ్మలు 
ఎప్పుడూ చూడని 
బొమ్మలు...
అమ్మా ..నాన్నా..
సరదాగా సేకరించిన 
బొమ్మలు....
ముచ్చటగా ..
మురిపించే బొమ్మలు!


దేవుళ్లు..దేవతలు
కార్మికులు ..కర్షకులు,


పశువులు..పక్షులు,
గుడులూ..గోపురాలూ,


శిలలూ..శిల్పాలూ..
పాడి ...పంటలు,


పురుషులు..పూజారులు
సోదిచెప్పే అవ్వలు,


రామచిలుక --
జోస్య గాళ్లు....


లక్కపిడత బొమ్మలు
కొండపల్లి బొమ్మలు
నిర్మల్ పైంటింగులు..


ఒకటా...రెండా....
ఎన్నో..ఎన్నెన్నో ..
ముద్దు గొలిపే బొమ్మ లు,
మురిపించే బొమ్మలు ..!
అందంగా -ఆకర్షణగా ,
కొలువు దీరిన బొమ్మలు !
చక్కనైన బొమ్మలు ...!!