పోస్ట్ ....-- యామిజాల జగదీశ్-

బంధువులూ
సన్నిహితులూ
స్నేహితులూ
ఎంత దూరంలో ఉన్నా
ఉల్లాసంగా వారి వారి
క్షేమసమాచారాలనూ
ఆత్మీయానురాగాలనూ
మోసుకొచ్చావు


హృదయాలు విప్పి 
రాసుకున్న మాటలన్నింటినీ
దారితప్పిపోకుండా
ఎంతో పదిలంగా
అందిస్తూ
ఆనందింప చేస్తుంటావు


ఓ రసమయ కావ్యంలా
ప్రతీసారీ చదివింపచేస్తుంటావు
ఉత్సాహంతో


ఉత్తరాలు మధురమైనవి
నిజమైన మనసులను
ఏకం చేయడంలో కీలకపాత్ర 
పోషించే ఉత్తరాల మహిమ
మరవగలమా....
మానగలమా.....


ఉత్తరాలిచ్చే సంతోషాన్ని
ఈనాటి వాట్సప్పులూ
ట్విట్టర్లూ
ఫేస్ బుక్కులూ 
ఎప్పటికీ ఇవ్వలేవు


హక్కుతో
చనువుతో
హృదయాన్ని పంచే
ఉత్తరాలకు
మరేవీ సాటిరావు


హృదయాలు పరస్పరం
పంచుకునే మాటలకు 
వారధివైన నిన్ను కాదని
ఆధునిక మాధ్యమాల వెంట పడి
పొందుతున్న ఆనందాన్నే ఆనందమంటుకుంటున్న వారికి
ఉత్తరాల విలువేం తెలుస్తుంది
పోస్ట్ అనే మాట 
వింటుంటేనే
మనసుకెంత ఖుషీయో
ఇక అందులోని అక్షరాలకు 
కళ్ళప్పగించి పొందే ఆనందం
అనంతం
నావరకైతే
ఎప్పటికీ నీకే నూటికి వెయ్యి మార్కులేస్తాను


 


కామెంట్‌లు