ప్రవహిస్తుందో వరద మనసు ఇరుకు
సందుల్లోకి!
దిక్కుతోచని దేహం దిక్కులు చూస్తుంది.
దిగులు అంధకారమై గద్దె నెక్కింది.
ప్రతీకార వాంఛలో సాగరం కట్టలు తెగింది.
అర్థరాత్రి తలుపు తట్టకుండానే ఆపద చాపకింద
నీరయ్యింది.
ఉలిక్కిపడి ప్రాణం పరుగులు తీసింది.
పుట్టకొకడు, చెట్టుకొకడు, చతికిలపడి సాయం
హస్తాల కోసం వెతుకుతున్నారు!
తాతల ఇళ్ళు వయో భారంతో కుంగిపోతున్నాయి.
ప్రకృతి కోపానికి కూలిపోతున్నాయి.
పూరి గుడిసెల రేకులతో మనిషి కూడా
గల్లంతు!
తేరుకునే లోపల మ్యానుహోలు కబళించే
జీవితాలు.
మనిషి ఖరీదు డబ్బులతో తూకం
లోతట్టు రోడ్డులో కారు పడవ ప్రయాణం
గమ్యమే లేక మునిగిపోయింది, దిక్కు లేక!
పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది నిజం
మహానగరమే వరదబాదితుల దృశ్యం.
పలుచబారిన కాంక్రీట్ కట్టడాలు
నడుం వరకు నీళ్ళతో ఈదుతున్నాయి.
భిన్న సంస్కృతుల నగరం నేడు
సాగరాన్ని తలపిస్తుంది.
సహాయం కోరి తలలు ఆకాశం వంక
చూస్తున్నాయి.
ఆకలి గొన్న ప్రకృతి ఇంకా పరీక్షిస్తుంది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి