అదొక భూతం: సాకి,కరీంనగర్.

అదొక భూతం
అందమైన ఆధునిక భూతం
ఆత్మ ని అంతం చేసి
ఆగం బతుకులని అందించేది అదే...
సంబంధాలని సంపేసి
సగం మనుషులని చేసేది అదే.....
సమయాన్ని మింగేసి
సదువులని సాగనియ్యనిది అదే.....
కుట్రలని నేర్పించి
కుటుంబాల కూల్చింది అదే......
అవసరం కొంతే
అనవసరం ఎంతో.....
ఆడంబరానికి అందలమెసేలా
ఆ భూతం నిత్యవసరం అయ్యింది...
ఆడదాన్ని అంగడి బొమ్మలా చూసేలా
ఆ భూతం నిత్యవసరం అయ్యింది...
అదొక విశృంఖల భూతం
అదొక సమ్మోహన భూతం
'మన'ల్ని మనం మరిచేలా చేసే
ఆ భూతమే టీ.వి.