గాంధారి గర్భం దాల్చి రెండేళ్ళు గడిచినా సంతానం కలగక పోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యకయైన సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడుగా పొందాడు. యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. మిగతా కౌరవులు, దుస్సల కన్నా ముందే జన్మించాడు.
ధుర్యోధనునితో సమ వయస్కుడు. వంద మంది కౌరవులలో ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కౌరవులలో జీవించియున్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే. తరువాత ఇంద్రప్రస్థానికి రాజైనాడు.ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీముని కాపాడాడు. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు.
యుయుత్సుడు..!--సుజాత.పి.వి.ఎల్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి