భాస్కర శతకము* - పద్యం (౬౪ - 64)

చంపకమాల : 
*పలుచని హీన మానవుడు | పాటిఁదలంపక నిష్ఠురోక్తులం*
*బలుకుచు నుండు గాని, మతి | భాసురుఁడై నగుణప్రపూర్ణుఁ డ*
*ప్పలుకులఁబల్కబోవడు ని | బద్ధిగ నెట్లన; వెల్తికుండ దాఁ*
*దొలఁకుచునుండుగాని మరి | తొల్కునె నిండుఘటంబు భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా


నిండుగా నీళ్ళు లేని కుండ, వెలితిగా వున్న కుండ అటూ, ఇటూ కదులుతూ వుంటుంది. కానీ, నిండుగా నీళ్ళు వున్న కుండ ఏకదలికా లేకుండా స్థిరంగా వుంటుంది.  అలాగే,  తెలివితేటలు, లేని గుణము లేని వ్యక్తి చెడు మాటలు, ఎవరికీ పనికిరాని మాటలు చాలా తేలికగా మాట్లాడస్తాడు.  కానీ మంచి ఆలోచనలు, తెలివితేటలు కలిగిన బిద్ధమంతుడు చలా అలోచించి నలుగురికి ఉపయోగించే మాటలు, పనులు మాత్రమే చేస్తాడు.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*అన్ని వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది* అని కదా నానుడి.


.....ఓం నమో వేంకటేశాయ


Nagarajakumar.mvss