ఆకాంక్ష.....:మొహమ్మద్. అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి)

సున్నితమైన మనస్తత్వం 
సువిశాల భావాలు 
నీ స్వంతం...


క్రమశిక్షణ పట్టుదలలు
క్రమం తప్పని భావాలు 
నీ స్వంతం ....


నిరంతరం నిశ్చలత్వం 
నిర్మలమైన ఆలోచనలు
నీ స్వంతం....


సస్నేహ సౌరభ భావాలు 
సుమధుర భాషణలు 
నీ స్వంతం.....


ఆత్మ విశ్వాసపు
ఆశలు ఆశయాలు 
నీ స్వంతం.....


చీకూచింతలు లేని
చిరునవ్వుల జీవితం 
కావాలి నీ స్వంతం ....


కలకాలం సుఖాల 
తీరాలు చేరుతూ
ఇలాంటి పుట్టిన రోజులు 
ఎన్నో  మరెన్నో ...


ఆనందంగా అందరితో 
జరుపుకోవాలని మా
ఆకాంష ప్రియ షామిర్...!!



కామెంట్‌లు