బాలలూ...
ఒంటరి జీవితాన్ని వదిలేసి
ఒక్కొక్కరిని పోగేసి
ఒకింత సంతోషాల పువ్వులను
అంబరాన ఎగరేసి
ఒత్తిడిని చేద్దామా
నుసి నుసి .....
అలసిపోయే చదువులకు
అప్పుడప్పుడు చెక్ పెడదాం...
అలరించే అందమైన
కధలతో ఆటపాటలతో
ఆనకట్ట కడదాం...
ఓనమాల బడి నుండి
అమ్మ ఒడి చేర్చుదాం
వ్యక్తిత్వ వికాసం
వికసింప చేద్దాం....
అంతరంగపు పొరల
మాటున దాగిన
ఆవేదనా పుటలను
ఆంతరంగిక ఆప్తుల
మధ్య తిరగేద్దాం
ఆనంద సాగరంలో
తేలిపోదాం.....!
అవిశ్రాంత జీవితంలో
అడుగడుగునా రూపం లేని
అనవసర ఒత్తిళ్లకు చెక్ పెడదాం...
మస్తిష్కాన్ని స్వేచ్ఛా స్వాతంత్ర్యాల
రారాజు ని చేద్దాం
మనసు పాడే మౌనరాగాలను
మనసారా విందాం.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి