మారిన కాలం ..: -- డా. కె.ఎల్వీ--హనంకొండ.

అప్పడప్పుడూ ,
కారెక్కి -
అనందంగా,
బయటి కి వెళతా ,


మమ్మీ -డాడీ 
వస్తారు ....
ముగ్గురమూ 
మంచి మాస్కులు 
ధరిస్తాము ..


ముక్కూ -మూతీ 
మూసేలా ...
మాస్కులు ....
సరిచేసుకుంటాము !


బయట తిరిగే 
సమయంలో ...
భౌతిక దూరం 
పాటిస్తాము ...
ఎంతో జాగ్రత్త గ 
ఉంటాము ....!


బయటకి వెళితే 
బర్గర్ -ఐస్ క్రీం 
అడగను నేను 


కేక్ -చాకోలెట్లు 
అసలే తినను ..!


ఇంటికి వచ్చి 
చేతులు కడిగి 
శానిటైజర్ ను 
చేతులకు రుద్ది 
స్నానం చేసేస్తా 
బట్టలు మార్చేస్తా 


తోటిపిల్లలతో 
గుమ్మపు వీథిలో 
తొక్కుడు బిళ్ల ...
ఆడేస్తా ...!


గుట్టుగా ఇంటికి 
వచ్చేస్తా .....!!
----------------------
ఈ ఫోటోలో : బేబీ..ఆన్షి.నల్లి.


కామెంట్‌లు