జడల దయ్యం (గేయ కథ)౼ దార్ల బుజ్జిబాబు

ఊరి చివర పాడుబడిన 
మేడలోన ఉన్నదంట
జడలతోన దయ్యమొకటి.
చెప్పుచుండ్రి పెద్దవారు.


పిల్లలెవరు పోవద్దని 
హెచ్చరికలు చేయుచుండ్రి.
పిల్లలే కాదు పెద్దలు కూడా
పట్టపగలే  మసలరెవరు


రాము రాజను తుంటరోళ్ళు
ఆరోతరగతి పిల్లగాళ్ళు
శలవరోజు పగటిపూట 
మేడగదివైపెళ్లినారు


భయంగానే తొంగి చూడ
లోనవున్న జడల దయ్యం
కనిపించెను ఇద్దరికి
పరుగు తీసే ఇంటివైపు.


విషయం చెప్పే అందరికి
బడిలో  చెప్పే మిత్రులకు
ఇదివిన్న సైన్సు సారు
పకపకమని నవ్వి చెప్పే.


"దయ్యంలేదు, భూతంలేదు
అంతా మన భయమ"నెను.
 "కావాలంటే రేపునేను 
మేడగదికి  వస్తాన"నెను


సరే అనిరి పిల్లలంతా
మేముకూడా వస్తామనిరి
పెద్దలెంతా వారించిన
వినకుండా పయనమైరి


పిల్లలంతా మాస్టారెంట
గదిలోకి దూరినారు.
మేడగదిలో దృశ్యం చూసి
ఆవాక్కయి పోయినారు.


రైతులను మోసంచేసే
నకిలీ విత్తులున్నాయి
పురుగు మందులున్నాయి
గంజాయాకులున్నాయి


దయ్యం వేషమేసుకున్న
మోసగాడు వున్నాడు.
పిల్లలంతా వాడిని పట్టి
చెట్టుకు కట్టి కొట్టినారు


పంతులుగారు వారించి
పోలీసులకు పోను చేసే.
వెనువెంటనే వారు వచ్చి
దయ్యం మనిషిని పట్టుకునెను


పిల్లలంతా కేరింతతో
పంతులుగారికి జై కొట్టిరి.
పెద్దలంతా ఇది విని
పిల్లలనెంతో మెచ్చుకునెను.


కామెంట్‌లు