నోటుకు బానిస కావద్దు ఓటు ....: - --డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ

ఏపార్టీ 
ఏమిచేస్తుందో 
దా ని ఉనికి ఏమిటో
ప్రజలకుబాగా తెలుసు !


అభివృద్ది 
చేసే అవకాశం 
ఎవరికి ఉంటుందో 
ప్రజలకు తెలుసు !


ఎన్నికల సమయంలోనే 
వాగ్దానాల సందడి 
నేపథ్యం కూడా 
ప్రజలకు తెలుసు !


ఓటు ..నోటుకు 
ఎలా సిగ్గువిడిచి 
బానిస అయిపొతుందో 
ప్రజలకు తెలుసు ...!


ప్రజల బలహీనతలకు-
ఎరవేసి....
ఎవరు సొమ్ము చేసుకోగలరో 
జనానికి బాగాతెలసు !


ఇన్నీ సంగతులు తెలిశాక 
రోడ్డు షోలు ..
బహిరంగసభలు 
ప్రజలకు చెప్పేదేముంది ?


కూలి డబ్బులకోసం 
ఎగబడి జెండా చేతబట్టే 
కూలీ ప్రేక్షకులు 
తెలుసుకునేదేముంది ..?


  .


కామెంట్‌లు