పాఠశాలంటే సరస్వతీ నిలయం
విధ్యార్థులకు పవిత్ర ఆలయం
గుడిలో దేవుడు బడిలో గురువు ఉండాలి
అమ్మానాన్నలు బిడ్డకు జన్మనిస్తారు
గురువులు వారిని తీర్చి దిద్ది
భావి పౌరులుగా రూపొందిస్తారు
బాల్యంలో మంచి నడవడిక
సమయపాలన క్రమశిక్షణ నేర్పుతారు
విధ్యార్థి తప్పులు చేస్తే దండిస్తారు
మంచి పనులు చేస్తే అభినందిస్తారు
జాతీయ నాయకుల త్యాగాలు
విధ్యవేత్తల సందేశాలు
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ
మానవసేవే మాధవసేవగా
నీతిని బోధిస్తారు
గురువులు కాదు సన్మార్గ మార్గదర్సకులు
* * *
విధ్యాలయం (బడి), :--కందర్ప మూర్తి , హైదరాబాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి