ఉపాధ్యాయపర్వం-22: రామ్మోహన్ రావు తుమ్మూరి


       అసలైన ఉపాధ్యాయ పర్వం ఇక్కడినుండి మొదలైనట్లు లెక్క.నిన్న ఫేస్బుక్ నీడలు జాడలెరుగని మిత్రునికి ఇలా ఉపాధ్యాయపర్వం ఫేస్బుక్లో రాస్తున్నాని చెప్పగానే ,వెంటనే ఉద్యోగపర్వం అనిపెట్టొచ్చు కదా! అన్నారు.నిజమే ముందు ప్రారంభించడం అలాగే అయింది. 
కానీ వెంటనే దాన్ని మార్చి ఉపాధ్యాయపర్వం అన్నాను. నిజానికి ఉద్యోగ పర్వమే తగిన శీర్షిక ఐనా ఇలా మార్చాను.నా భయమల్లా అది భారతం గురించి కావచ్చునని చాలా మంది చూడకపొయ్సే అవకాశం.మీ అందరికీరకవిారని. తెలిసిన విషయమే ఆ విషయం గురించి చాలామంది రాస్తున్నారని. ఇక నా మొదటి ఉద్యోగం కూడా చాలావరకు అదే బాటలో సాగింది కనుక అలా పెట్టాను.ఒక్కో సారి చిరుదోషం కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది.
అవి అలాగే పాపులర్ అవుతాయి.నాదీ అలాంటి ఆశే.
          సరే,ఇక బాలభారతికి వద్దాం.అది మొదట్లో చిన్న గుడిసెలో మొదలయ్యిం ది.కంపెనీ కార్మికపు పిల్లలకోసం ఏర్పడ్డ పాఠశాల.కంపెనీ స్థలంలోనే ఉంది. అప్పట్లో దానిముందే బస్సులాగేవి. అదే బస్టాండు.అప్పటికి కాగజ్ నగర్ కు ప్రత్యేక బస్ షెల్టరు లేదు ఇప్పటిలాగా.
మెల్లమెల్లగా విద్యార్థులు ,తరగతులు పెరగటంతో పి.యం.రావు,రాజారెడ్డి గారలు ప్రత్యేక శ్రద్ధ వహించి తరగతి గదులు కట్టించారు.దినదిన ప్రవర్ధమానంగా నేను చేరేనాటికి ఒక్కో తరగతి నాలుగైదు సెక్షన్లుగా ఉండి అతిపెద్ద స్కూల్ గా రూపొందింది.స్టాఫ్ రూమే తరగతి గదిలాగా ఉండేది. యాభై మందికి పైగా టీచర్లుండటంతో కొందరు పరిచయం కానివారు కూడా ఉన్నారు.నేనున్న నలభై సంవత్సరా లలోనే దాని ఉత్థానాన్ని పతనాన్ని కూడా చూశాను.మంచి పీకి లో ఉన్నపుడు నేను పనిచేయటం జరిగింది.కనుక నాకు ఆస్కూల్ సర్వీసు ఒక రకంగా ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్పవచ్చు.నేను ఎంతోమంది పిరధానోపాధ్యాయులను చూశాను కానీ The best administrator అని మాత్రం పంకజవల్లి గారికే కితాబిస్తాను.
2500 మంది విద్యార్థులు 50 మంది ఉపాధ్యాయులు గీచిన గీత దాటకుండా 
ఉండటమనేది మామూలు విషయం కాదు.ప్రార్థన అయిందంటే గేటుకు తాళం పడేది.ఆలస్యంగా వచ్చిన టీచర్లయినా విద్యార్థులైనా వెనుకకు పోవలసిందే.నేను కనీసం రెండు మూడు సార్లైనా మరలి పోయాను. అంతే ఆ పూట ఆబ్సెంట్.అక్కడ నేను తెలుసుకున్నదేమీటంటే శిక్ష కఠినంగా ఉంటే అదుపు ఏర్పడుతుందనేది. అమలు విషయంలో ఎవరూ మినహాయింపు లేకపోవడం మరొక కంట్రోలింగ్ పాయింట్. ఆమె చారచక్షువు కూడా.పాఠశాలకు అంకితమైన కొందరు ఉపాధ్యాయుల సహకారం ఆమెకు ఉండేది.మనకు మందలింపుల వంటి సూచనలు వారే 
అందించే వారు.గమ్మత్తుగా మా బియ్యెడ్ బ్యాచ్ నలుగురం ఆ స్కూల్‌లే
మాకు కొంత రిలీఫ్.అందరం మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టు వాళ్లమే.రెండు నెలలు గడవగానే ఐటిడిఎ లో టీచరుపోస్ట్ లకు నోటిఫికేషన్ పడింది.అందరం వెళ్లాం.నా అప్లికేషన్ రిజెక్టయింది.34 ఏళ్లు దాటాయని.మా బ్యాచ్ లో ఇద్దరు ముగ్గురికి అందులో వచ్చింది.అది కాగానే జెడ్పీ నోటిఫికేషన్ పడింది.అదో పెద్ద తతంగం.దాని గురించి చెప్పే ముందు బాలభారతి సెంటిమెంటు గురించి చెప్పాలి.అది గేట్ వే ఆఫ్ గవర్నమెంటు జాబ్ గా పేరు పొందింది.ఆ స్కూల్‌లో పనిచేసిన చాలా మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి.(సశేషం)


కామెంట్‌లు