1987-88 బి.ఎడ్. బ్యాచ్ మాది. బహుశా జూన్ లో రిజల్ట్స్ వచ్చినట్లు న్నాయి.జూలైలో బాలభారతి లో చేరాను. సరిగ్గా సర్ సిల్క్ లో చేరిన 14 సంవత్స రాల తరువాత అన్నమాట.
ఇక్కడొకసారి నా సర్ సిల్క్ లో చేరక ముందు ,డిగ్రీ అయిన తరువాత ముచ్చట చెప్పాలి.అది ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పనిచేసిన పెండ్యాల మధుసూదనరావు మామ గురించి.కార్యకారణ సంబంధం అనే మాటకు ఇదో పెద్ద ఉదాహరణ.మీకు గతంలో చెప్పాను నేను 1969లో పి.యు.సి.లో చేరే ముందు ఈయన మాటమీదనే M.P.C. లో జాయిన య్యాను.ఆయన మా బాపు మేనత్త కొడుకు.ఆ సమయంలోనే హైదరా బాదునుండి కరీంనగర్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసు సూపరిం టెండెంట్ గా బదిలీపై వచ్చారు. ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులో పనిచేస్తారు గనుక ఏది తూలుతుంటే ఉద్యోగావకాశాలుం టాయో ఆయనకు బాగా తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయనను అడగటం,ఆయన చెప్పినట్లే చేయటం నిజంగా నా జీవితం లో నాకు తెలియని ఒక అదృష్టం. దాని ప్రభావం అంతా ఇంతా కాదు.ఎలాగో చెప్పే ముందు ఆయన చేసిన మరో మహోపకారం గురించి కూడా చెప్పుకోవాలి. అప్పట్లో ఏ ఉద్యోగానికైనా ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.ముఖ్యంగా గవర్నమెంటు ఉద్యోగాలకు.ఆయన నా ఎంప్లాయ్ మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ H.S.C. పాస యిన సర్టిఫికేటుతో 1970 వ సంవత్స రంలో 1/70 మొదటి రిజిస్ట్రేషన్ నాది
చేశారు.అప్పటినుంచి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ రావటం జరిగింది. 1973 లో డిగ్రీ చదువు పూర్తి కాగానే ఇంకా రిజల్ట్స్ రాకమునుపే ఆయన ఇంట్లో ఉట్టిగ ఉండకుండా మధుమామ (మేమాయనను అలా పిలిచే వాళ్లం)
ఆఫీసు లో జీతం లేకుండా పని నేర్చుకోవడం ( ఒమీద్ వారీ)కోసం చేరాను.రోజూ ఎలగందుల నుండి కరీంనగర్ వెళ్లి వచ్చేవాణ్ని. అప్పట్లో బస్ టికెట్ నలభై పైసలు.రావూ పోనూ ఎనభై పైసలు,ఇరవై పైసలు చాయకో దేనికో అని రోజుకో రూపాయిచ్చే వారు ఆయన వద్దన్నా వినకుండా.నెలకు ఇరవై ఐదు రూపాయల ఖర్చు అన్నా అప్పుడు పేద వాళ్లుకు పెద్దభారమే.
రిజల్ట్ రాగానే ఎంప్లామెంట్ కార్డ్ మీద గ్రాడ్యుయేట్ గా నమోదు చేయించారు
ఆయనే.ఈ లోగా సర్సిల్క్ ప్రయత్నం జరగటం అక్కడ చేరటానికి ఓ ఏడాది పట్టింది. అంతకాలం ఆయన దగ్గరే పనిచేయటం జరిగింది.ఈ మధ్యలోనే ఆయన ఆదిలాబాదు ఎంప్లాయ్మెంటు ఆఫీసరు ప్రమోషన్ మీద వెళ్లారు. వెళ్లగానే నన్ను నా ఎంప్లాయ్మెంటు కార్డ్ ఆదిలాబాద్ కు మార్చుకొమ్మన్నారు. అక్కడైతే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని.అలా కార్డ్ మార్చుకోవడా నికి మొదటి సారి ఆదిలాబాదు వెళ్లాను. అప్పుడు అచ్చమైన పల్లెటూరుగా ఇసుకబజార్ల ,ఇరుకుగల్లీల ,గూనపెంకల ఇండ్ల ఏదులాపురం చూశాను. అప్పటి ఆదిలాబాదుకు ఇప్పటి ఆదిలాబాదుకు పొంతనే లేదు. సరే
ఇంతలో నాకు సర్సిల్క్ జాబ్ వచ్చిందని చెప్పాను.ఆయన మాత్రం అది ప్రైవేట్లు కదా!ఎందుకైనా మంచిదని నన్ను ప్రతి సంవత్సరం గుర్తు చేసి మరీ రెన్యువల్ చేయించేవారు.అలా నా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆదిలాబాదు రాకపోయి ఉంటే కథ వేరేగా ఉండేది.
ఇప్పుడు మళ్లీ 1988 లోకి వద్దాం.
బాలభారతి ఉద్యోగం మూడు నాలుగు నెలలు గడవగానే జెడ్పీలో డి.ఎస్.సి
పోస్టుల నోటిఫికేషన్ పడింది.మా స్కూల్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎనమండుగురం అప్లై చేసుకున్నాం.
జెడ్పీలో 36 ఏళ్ల వస్తే పరిమితి అని ఎవరో చెబితే నేను కూడా అప్లై చేశాను.
ముందు రాతపరీక్షల క్వాలిఫై కావాలి.
అది రాసి క్వాలిఫై అయిన తరువాత ఇంటర్వ్యూ కోసం ఎంప్లాయ్ మెంటు ద్వారా లిస్టు వెళ్లాలి .అక్కడికి వెళితే వాళ్లు కూడా 34 సంవత్సరాలు నిండని వారి లిస్ట్ మాత్రమే తయారు చేశారు. నేను అడిగితే 36 ఏళ్ల జీవో మాకు తెలియదని చేతులెత్తేశారు. ఆశవదులుకుని ఏదో పని మీద కరీం నగర్ వచ్చాను.బాపుతో సంగతి చెబితే
ఆయనకు తెలిసిన హెడ్మాస్టరు దగ్గరికి తీసుకువెళ్లారు.ఆయన ఉపాధ్యాయ యూనియన్ కు చెందిన వ్యక్తి.ఆయన వెంటనే వెతికి 36 సంవత్సరాల వయోపరిమితి జీవో ఇచ్చారు.అది పట్టుకుని ఆదిలాబాదు వెళ్లగానే ఎంప్లాయమెంటువాళ్లు సంతోషించి నాతోపాట మరో పదిహేను మంది లిస్టు తయారు చేసి పంపించారు.మిగతా పద్నాలుగ మంది వాళ్లను బాగానే సంతోష పెట్టి ఉంటారు.సరే ఏదైతేనేం నా క జెడ్పీ ఇంటర్వ్యూ దాకా రావడానికింత తతంగం నడిచింది.
ఇక ఇంటర్వ్యూ సంగతులు ఇంకా విచిత్రం.(సశేషం)
ఉపాధ్యాయపర్వం-23: - రామ్మోహన్ రావు తుమ్మూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి