నైమిషారణ్యం(పురాణకథ)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు.అతనికి విద్యుత్ప్రభ,కాంతిమతిఅనే ఇరువురు భార్యలుఉన్నారు.సంతానహీనుడైన సుప్రతీకుడు చిత్రకూట పర్వతపై ఉన్న ఆత్రేయుడు అనే మునిని దర్శించి సేవించి తనకు సంతానంకలిగేలా వరం ప్రసాదించమన్నాడు. అదేసమయంల అక్కడకు తన ఐరావతంతో వచ్చిన ఇంద్రుని రాజ్యభ్రస్టుడి అయి పోదువుగాక అని ఆత్రేయుడు శపించాడు. పరాక్రమవంతుడైన పుత్రుడు జన్నిస్తాడు అనిసుప్రతీకునకు వరంఇచ్చాడు. విద్యుత్ప్రభకు దుర్జయుడు,కాంతిమతికి సుద్నముడు జన్మించారు.కాలక్రమంలో దుర్జయునికి పట్టాభిషేకంచేసిన సుప్రతీకుడు తనభార్యలతో చిత్రకూట పర్వతా రణ్యంలో తపమాచరించసాగాడు.ఎక్కువ సైన్యాన్ని సమీకరించుకున్న దుర్జయుడు ఉత్తరదిక్కున దండయాత్రకు బయలుదేరి,భరతవర్షం,కింపురుషవర్షం,హరివర్షం,హిరణ్మయవర్షం,కురుభద్రాశ్వమం,ఇలావృతాలు జయించి,ఇంద్రలోకాన్నిజయించి గంధమాధన పర్వతంపై విడిదిచేసి విశ్రాంతి పొందుతున్నసమయంలో,ఇద్దరురాక్షసులు వచ్చి రాజా నీపేరిట ధర్మంతప్పక ఈస్వర్గ లోకపాలనచేస్తాం దయచేసి మాకు  ఆ అవకాశంకలిగించు అన్నారు.వారిని స్వర్గపాలకులుగా నియమించి,దుర్జయుడు మందరపర్వతంచేరాడు.అక్కడివనంలో విహరిస్తుండగా ఒక చెట్టుకింద కొందరు స్త్రీలు కనిపించి అద్రుశ్యమయ్యరు.వారినివెతుకుతూవెళ్లగా ఇద్దరుమునిశ్వరులు కనిపించగా నమస్కరించాడు.మేము విష్ణుమూర్తి చేతిలో ఓడిపోయి తపోవనంలో జీవిస్తున్నాము,మాదివ్యదృష్టిచే నీవెవరివో తెలిసింది మాకుమార్తెలైన సుకేసి,మిశ్రకేసిలను వివాహంచేసుకో అన్నారు.
వారిని దుర్జయుడు వివాహంచేసుకోగా సుకేసికి సుప్రభుడు,మిశ్రకేశికి సుదర్మనుడు జన్మించారు. మరో పర్యాయం తన సైన్యంతో అరణ్యంలో ప్రయాణిస్తూ గౌరవముఖుని ఆశ్రమంలో ఆగి అందరికి తనవద్దనున్న మణి సహకారంతో భోజనం ఏర్పాటు చేసాడు.ఆమణిని దుర్జయుడు కోరగా గౌరవముఖుడు తిరస్కరించాడు.దుర్జయుడు యుద్దప్రకటించగా, మణినుండిసుప్రభుడు, దీప్తతేజుడు,సురస్మి,శుభదర్శనుడు,సుకాంతి,సుందరుడు,సుందుడు,ప్రద్యుమ్నుడు,సుమనుడు,శుభుడు,సుశీలుడు,సుఖదుడు,శంభుడు,సుదాంతుడు,సోముడు అనేవీరులు ఉద్బవించి యుద్ధానికి వచ్చారు.దుర్జయుని సైన్యంలో ప్రఘనుడు, విఘనుడు, సంఘశుడు, అశనిప్రభుడు, విద్యుత్ర్పభుడు,సుఘోషుడు,ఉన్మాత్తాక్షుడు,భయంకరుడు,అగ్నిదంతుడు,అగ్నితేజుడు,బాహుశక్రుడు,ప్రతర్ధనుడు,విరాధుడు,భీమకర్ముడు,విప్రచిత్తి వంటి యోధులు తో యుద్థంఆరంభం అయింది. గౌరముఖుడు శ్రీమహవిష్ణువు నుప్రార్ధించగా  సుదర్శనచక్రం దుర్జయునిసైన్యం మెత్తాని సంహరించింది .