చదివిన కొద్దీ సముద్రం గర్భానికి వెళ్లి బతుకు లోతును తెలుసుకునే సాహసం
చేయాల్సిందే!
సర్వశాస్త్రాల మూల సర్వజ్ఞతను
మానవ నిర్మాణపు సంక్లిష్ట కణాల కూర్పు తెలిపే సంగతులను
నెమరువేసు కోవాల్సిందే
భవిత అల్లిక కోసం పదేపదే వల్లే వేయాల్సిందే !
ఈ పద్యాలెప్పుడూ వెలిసి పోకుండా ముఖానికి కొత్త తేజస్సు నింపడం కోసం అందాలు చిందడం కోసం రాగాలు తీయాల్సిందే హార్మోనియం పెట్టె శృతిచేయాల్సిందే!
ఇది ఎప్పుడో చదివిన నవల కాదు నిత్యం చదివే గీతయైతేనే రాత మార్చుకోవచ్చు!
జారిపోయే చేప ను పట్టడానికి
కొత్తవలను తెచ్చినట్టు
ఒడుదొడుకుల
ఒడిసి పట్టే కళను ఆకళింపు చేసుకోవాల్సిందే!
వ్యక్తి గతం లోంచి సమిష్టి లోకి తాను చూసుకునే అంతరీక్షణ మే ఈ జీవన మహాగ్రంధ పఠనం!
ఎప్పుడూ ఒక వింత లాగే కనిపిస్తుంది చిట్టా విప్పినకొద్ది అంతు చిక్కని చేద బావి
పోగొట్టుకున్న దేదో దొరికే దాకా పాతాళ గరిగే తిప్పాల్సిందే!
పాత సెల్ ఫోన్ రింగ్ టోన్
చెవిలో మొగుతూ వెన్నాడినట్టు
దశలు దాటినా వాసనలు వదలవు!
జీవిత గ్రంథం లోని ప్రతి పేజీ లోని అలంకారాల అంతరార్థం విప్పడం కోసంఉత్తరోత్తరా పుస్తకాన్ని ఆశ్రయించాల్సిందే !
పరమ రహస్యాల కోసం మెదడు లో అంతర్జ్వలనం
రగలాల్సిందే
అధ్యయనం
జరగాల్సిందే!
సమయం
సరిపోక పోవచ్చు మిత్రమా
ఆగిపోక నిరంతరం
చదువుతూ సాగిపో..కదిలిపో!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి