ఆటవెలది:
*భూరిబలాఢ్యుడైనఁ దల | పోయక విక్రమశక్తిచే నహం*
*కారము నొందుటల్ తగవు | గాదతఁ డొక్కెడ మోసపోవుఁగా*
*వీరవరేణ్యుఁ డర్జునుఁడు | వింటికి నేనధికుండ నంచుఁ దా*
*నూరక వింటి నెక్కిడఁగ | నోపఁడు కృష్ణుఁడు లేమి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
మూడు లోకములలో నేనే నాకు సరియగు బలవంతుడను అయిన అర్జునుడు కూడా కృష్ణుని నిర్యాణానంతరము, తన విల్లుని ఎక్కుపెట్టి విల్లంబులు వేయలేకపోయాడు. అలాగే, మనుష్యులు కూడా తాము ఎంతో ధై
ర్యవంతులము, బలవంతులము అనుకున్నప్పుడు, తమ అహంకారము చేతనే ఓడింపబడుదురు......అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఎంతటి శౌరగయవంతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు అయినా, తానే చేయగలడు, తన వల్లే అన్నీ అవుతాయి అని గర్వపడకూడదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి