భాస్కర శతకము - పద్యం (౮౩ - 83)

  ఉత్పలమాల: 
 *మానవనాధుఁ డాత్మరిపు | మర్మ మెరింగినవాని నేలినం*
*గాని జయింపలేఁడరుల | గార్ముకదక్షుడు రామభద్రుఁడా*
*దానవనాయకున్ గెలువఁ | దానెటులోపుఁ దదీయ నాభికా*
*స్థానసుధ న్విభీషణుఁడు | తార్కొని చెప్పకయున్న భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
ఎంతటి మహావీరుడైన రాజు అయినా తన శతృరాజు యొక్క అత్యంత రహస్య విషయాలు తెలుసుకుంటే తప్ప విజయం సాధించలేడు.  ఎలాగంటే, రామ రావణ యద్ధ సమయంలో, రావణబ్రహ్మ ఆయువుపట్టు అతని నాభిలో వుంది అనే రహస్యం ఆతని తమ్ముడు విభీషణుడు  చెప్పిన తరువాతే రామచంద్రమూర్తిని విజయలక్ష్మి వరిస్తుంది కదా అలా.....అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss