గణాధిపతి -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్:9290061336

మనం ఏం ప్రారంభించిన, ఏ కార్యక్రమంలోనైన విఘ్నాలు, ( ఆటంకాలు) ఏవీ రాకుండా ముందుగా విఘ్నేశ్వరుని (గణపతిని)  ప్రార్ధిస్తాం.
 బాలలకు కూడా ఓ  ప్రార్థన నేర్పుతాం.
ఉదా:-
                 దండాలు (బాలగేయం)
దండాలండీ దండాలు/ బాల గణపతికి దండాలు/
ఆది దేవునికి దండాలు/ఉండ్రాళ్ళ స్వామికి దండాలు//
దండాలండీ  దండాలు/చదువుల తల్లికి
దండాలు/  తెలుగు తల్లికి దండాలు/  మా
కల్పవల్లికి   దండాలు//
దండాలండీ దండాలు/ అమ్మా నాన్నకు దండాలు/
గురువులందరికి దండాలు/పెద్దలందరికి దండాలు//
   ( స్వీయ రచన, బడి గంటలు-బాలల గేయ సంకలనము లోనిది)
------------------------   ----------------  ----------------
             //గణపతి - గణాధిపతి//
            *********.    **********
                  (బాలలగేయ కథ)
దండాలయ్యా దండాలు/ఆది దేవునికి దండాలు/
గణపతి దేవా దండాలు/ఆది దేవుడా దండాలు,//
  
వినాయకునికే ముందుగా/ పూజలెందుకో తెలుసా/
గణపతి దేవ చరితం/ బాలలు మీరు చదవండి//


పవిత్ర పావన గిరులు/దివ్య తేజ కైలాస గిరులు/ఆసీనులైరి ఆది దంపతులు/పార్వతీ పరమేశ్వరులు//
ఒక దిశ వినాయక స్వామి/మరో దిశ కుమార స్వామి/కింకరులు తాండవింపగ/భక్త జనులు పరవసింపగ//
దేవ గణాధిప స్థానమై/చర్చించిరి దేవతలెల్ల/
సుర గణముల సందేహము/ప్రధమ అధిపతి ఎవరని?//
కుమారస్వామని కొందరు/వినాయకుడని మరి కొం దరు/పంతాలకు పోవగ సురులు/తీర్పునిచ్చెద దెవరనగ!!?//
నారాయణ! నారాయణయని/నారదుడే ప్రవేశింపగ/
సురులు  మది నున్నది తెలుపగను/కొలది సేపు
ఆలోచింపగను//
ముల్లోకములు సంచరించి/ పవిత్ర నదుల మునిగి వచ్చి/ముందుగా వచ్చు వారు అధిపతి/ అతడే ప్రథమారాధ్యుడు//
నారద ముని సందేశము విని/ దర్పంగా నెమలి వాహనుడై/కుమారస్వామి గర్వపడే/ముల్లోకములు
సంచరింపగ//
మూషిక వాహన మెటులని/రాదగు, నారద స్వామి?/వినయంగా వినాయకుడు /ధర్మ సూక్ష్మం చెప్పమనె// 
ముల్లోకాలే తల్లిదండ్రులు/తల్లిదండ్రులే ముల్లోకాలు/
ప్రదక్షిణలు చేసిన చాలు/ నారద సందేశమే విని//
భక్తితో ప్రణామాలు/వినాయకుడు ఆచరింప/ తల్లిదండ్రుల చుట్టూ/ ప్రదక్షిణలు ముమ్మా రు//


కార్తికేయుడు  మునిగే /పవిత్ర నదుల యందున /
వినాయకుడు ముందుగ/మునిగి వచ్చి  ఎదురాయే//
గణములకెల్ల అధిపతి/ గణపతి పీఠాధిపతి/ ప్రధమ పూజార్హుడు/ విశ్వారాధ్యు డాయె//
తల్లిదండ్రులు దీవింపగ/ సర్వ గణములు నుతింపగ/ జయ జయ ధ్వనులు మ్రోగగ/ మోదమున ఆమోదింపగ//
కార్తికేయుడు అలుక బూని/కైలాసం వీడి కినుక జూపె/ పళని గిరుల పాదం మోపగ/పావన  క్షేత్రమై
వెలసే//
దేవతలకే దేవుళ్ళు// తల్లిదండ్రులు దేవుళ్ళు,/
సదా కనిపించు వారలు/పూజించి తరింపగను//
  
బాలలు! మీరు! తెలిసుకోరండి/
దేవతలకు కన్నవారలైన/
తల్లిదండ్రులేర దేవుళ్ళైన
మరువకు మనకు  దేవుళ్లేర//
        **********   **********  *********
           దండానికి అర్థం... తెలుసా!...
గుండెలు తాకిన  బొటన వ్రేలు/మదిలో మెదిలే తల్లి దండ్రులు/కనులకు కనిపించే దేవుళ్లండి/ఎల్లవేళల
తలవాలండి//
రెండవదండి చూపుడు వ్రేలు/మంచి మార్గం చూపే గురువులు/గురుతుగ తలచే దేవతలండి/ మనసున
సదా నిలపాలండి//
మధ్యనున్నది పెద్ద వ్రేలు/జాతి రత్నాలు రాష్ట్రపతులు/పాలకులైన ప్రధానమంత్రులు/ 
జాతి వెలుగులు చూపే దివ్వెలు//
    నాలుగవదండి ఉంగరపు వ్రేలు/ బలహీనమైనదే ఈ వ్రేలు/ మన మేలుకోరు దీనులు హీనులు/నిత్యం
చేయాలి వారి సేవలు//
    ఐదవదండి చిటికెన వ్రేలు/ చిట్టి మనసుల చిన్నారి బాలలు/ వివేక వంతులు విద్యా శీలురు/ భావి తరా లకు జాతి వారసులు//