భాస్కర శతకము - పద్యం (౯౩ - 93)

  చంపకమాల: 
 *వలవదు క్రూరసంగతి య |  వశ్య మొకప్పుడు సేయఁపడ్డచోఁ*
*గొలఁదియెకాని యెక్కువలు  | గూడవు, తమ్ముల పాకులోపలం*
*గలసిన సున్నమించుకయ | కాక మరించుక ఎక్కువైనచో*
*నలుగడఁ జుర్రుజుర్రుమని | నాలుక పొక్కయున్నె  భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
తాంబూలములో సున్నము అవసరమైనంత వున్నప్పుడు, తాంబూలము రుచిగా వుండి, నాలుక ఎర్రగా పండుతుంది.  అదే సున్నము ఎక్కువ అయితే, నాలుకపై పొక్కలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది.  అలాగే, చెడ్డ వారితో స్నేహం చేయనే కూడదు.  తప్పనిసరిగా చేయవలసి వచ్చినప్పుడు, ఎంతో జాగ్రత్తగా అవసరం వరకు మాత్రమే వారిని కలవాలి గానీ ఎక్కవగా స్నేహం చేయడం ప్రణాంతకమే అవుతుంది....అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఎక్కవగా ఏది చేసినా, మనకు చెడే జరుగుతుంది. అది చెడ్డవారితో స్నేహం అయితే, మనకు మాత్రమే కాక మన ఇంటికి కూడా చెడు జరుగుతుంది*  అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు