బలిచక్రవర్తి.(పురాణపాత్ర)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 హిరణ్యకశిపుడు లీలావతి దంపతులకు జన్మించినవాడు ప్రహ్లదుడు ఇతనిభార్యదేవి. ఈదంపతులకు ఆయుష్మంతుడు, శిబి,విరోచనుడు, కుంభుడు,నికుంభుడు అనేపుత్రులు కలిగారు,వీరిలో,విరోచనుడి కుమారుడు.బలిచక్రవర్తి భార్యఆశన. ఈదంపతులకు బాణుడు, ధృతరాష్టృడు,నికుంభనాభుడు, విభీషణుడు అనేకుమారులతో పాటు,రత్నమాల అనేకుమార్తెకూడా ఉంది.ముల్లోకాలు జయించిన మహవీరుడు.ఇతన్ని జయించలేక ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు శ్రీమహవిష్ణువును శరణుకోరతారు. వామనావతారంలో వచ్చిన విష్ణు మూర్తి బలిచక్రవర్తిని మూడు అగుగు అస్ధలం దానంగా కోరుకుంటాడు. శుక్రాచార్యుడు వంటి రాక్షస గురువు'వచ్చినవాడు మహవిష్ణువు'అని హెచ్చరిస్తున్నా వినకుండా'వచ్చింది మహవిష్ణువు అయితే  అతనికి దానం ఇవ్వగలిగే స్ధానం నాకు లభించడం నాచేయిపైనా విష్ణువు చేయి కింద ఉండటం నాకు ఎంతో గొప్పకదా'అని  వామనుడికి కొర్కెతీర్చటానికి సిధ్ధపడి మూడు అడుగుల స్ధలం ధారపోయడానికి కమండలంలోని నీటిని వంచబోగా శుక్రాచార్యుడు కమండలంలోని నీరు వెలుపలకు రాకుండా జారి కొమ్మకు తనుసూక్ష్మరూపంలోవెళ్లి అడ్డు పడతాడు.వామనుడు దర్బతో పొడవగా శుక్రచార్యునికి ఒక కన్ను పోతుంది,మూడు అడుగుల స్ధలం దానంపొందిన,వామనుడు ఒక కాలిని భూమిపై మరో కాలిని ఆకశానఉంచి మూడో అడుగుకు స్ధలమేది అనగా,బలి తన శిరస్సుపై పాదాన్ని ఉంచమనగా,వామనుడు బలిని పాతాళానికి తొక్కివేస్తాడు.తనజీవితకాలంలో ఏనాడు అసత్యమాడని,బలి చక్రవర్తి చిరంజీవి.మరణాన్ని జయించిన వారిలో తనూ ఒకడు.ఇతనికి పలువురుకుమారులు ఉన్నారు. వారిలో జేష్ఠుడు 'బాణాసురుడు'ఇతను శివుని తన నగరానికి కావలి దారునిగా చేసినవాడు. మహావీరుడు. బలిచక్రవర్తి విష్ణువు అనుగ్రహంతో ఓమన్వంతరంలో ఇంద్రపదవి అనుభవించాడు.