మనుగడ ...: - ----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ .

ప్రేమించటం 
నేర్చుకుంటే ,
అదిమొక్కైనా 
మనిషైనా 
సమాజానికి 
మంచిని అందించే 
ప్రయత్నం 
జరుగుతుంది !


మనిషిలో ,
ఆలోచించే -
మనసు ఉంటే ,
మొక్క మనుగడ 
శాశ్వతమై -
పచ్చదనంతో ,
ప్రకృతి -
పరవశిస్తుంది !


మనిషికి -మొక్క కు 
ఉన్నబంధం ...
ఈ సృష్టి 
కొనసాగినంతకాలం 
నిలిచిపోయే -
పచ్చని --
అనుబంధం ...!!