ఇంద్రజిత్ యుద్ధం .(పురాణకథ)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

నసోదరులమరణవార్త విన్న ఇంద్రజిత్ మండిపడుతూ "తండ్రి నాసోదరులమరణానికి కారణమైన ఆనరులను సంహరించి పగతీర్చుకుంటాను.నాడు నేనుప్రయోగించిన నాగాస్త్రం నుండి రామలక్ష్మణులు బంధవిముక్తులు అయిఉండవచ్చు,నేడు నాచేతిలో దారుణమరణానికగురికాబోతున్నారు,నన్నుఆశీర్వదించండి" అనిచేతులుజోడించాడు.తండ్రి ఆశీర్వాదం పొందిన ఇంద్రజిత్ యుధ్ధంలో రామలక్ష్మణులపై పలుదివ్యశరాలు ప్రయోగించాడు.చిరునవ్వుతో శ్రీరాముడు ఆ అస్త్రాలను మార్గమధ్యంలో తుంచాడు.విసిగిపోయిన ఇంద్రజిత్ బ్రహ్మాస్త్మాంప్రయోగించాడు.ఆ అస్త్రాన్నిగౌరవించి రామ లక్ష్మణులు సోమ్మసిల్లారు.వేలాది వానరసైన్యంప్రాణాలు కోల్పోయారు. విజయభేరిలు మోగించుకుంటూ ఇంద్రజిత్ లంకానగరానికి వెళ్లాడు. అదిచూసిన జాంబవంతుడు "విభీషణా హనుమంతుడు ఎక్కడా "అన్నాడు" మహశయా రామలక్ష్మణులు ప్రాణలు అపాయంలో ఉన్నాయి ముందు వీరినిగమనించండి"అన్నాడు విభీషణుడు."నాయనా విభీషణ హనుమంతుడు జీవించిఉన్నట్లయితే వానరసైన్యం హతమైనా జీవించి ఉన్నట్లే.అలాకాకుండా హనుమంతుడు మరణిస్తే మనమంతా మరణించినవారితో సమానమే"అనగానే దూరంగా ఉన్నహనుమంతుడు వినయంగా చేతులుకట్టుకుని జాంబవంతునిముందు నిలిచున్నాడు. "నాయనానీవువెంటనేగగనమార్గాన లంకా నగరం లోనికి వెళ్లు సుషేణుడు అనేరాజవైద్యుడు ఉన్నాడు అని ఆనవాళ్లు చెప్పిపంపాడు.సుషేణుని యింటితో సహా పెకిలించి తీసుకువచ్చాడు హనుమ.రామలక్ష్శణులను పరిక్షించినసుషేణుడు.హనుమాఉత్తరదిశగాఉన్నహిమాలయాలకు వెళ్లు.అక్కడ కాంచకపర్వతశిఖరానికీ,కైలాసపర్వతశిఖరానికి మధ్య ఓ ఔషద పర్వతంఉంది.ఆపర్వతంపై సంజీవకరణి అనే ఔషదం మృతులను బ్రతికిస్తుంది.విశాల్యకరణి అనే మరో ఔషదం.దీనివలన శరీరంలో దిగిన అస్త్రాలు తొలిగిపోతాయి.సౌవర్ణకరణి అనేమరో ఔషదంఉంది.దీనివలన ఎంతటిగాయం అయినా క్షణాలలో మాయంఔతుంది.నాలుగో ఔషదం సంధానకరణి ఇది తెగిపడిన అవయవాలను తిరిగి జతపరచే దివ్యఔషదం.వెంటనేవెళ్లిఈనాలుగుఔషదాలుతీసుకురావాలి.రామలక్ష్మణులకు స్వస్తత చేకూర్చడంతోపాటు,మనవానరవీరులు అందరిని బ్రతికిస్తాను" అన్నాడు.తక్షణం ఆకాశమార్గాన సుషేణుడు చెప్పిన పర్వతం కొరకు బయలుదేరి దారిలో కాలనేమిని హతమార్చి,ఔషదపర్వతంచేరిన హనుమంతుడు ఔషదాలను గుర్తించలేక ఔషద పర్వతాన్నే పెకలించి కుడిచేతిపై ఉంచుకుని,ఎడమచేతి లోగధను భుజంపైన ఉంచుకుని జైశ్రీరామ్ అని గగన మార్గాన ప్రయాణంచేసి సుషేణుని ముందు దిగాడు.ఆఔషదాలతో  రామలక్ష్మణులతో పాటు,వానర సైన్యాన్ని కాపాడాడుసుషేణుడు.జయధ్వానాలతో వానరులు చేసే ఆనంద హేల రావణునిచెవికిచేరడంతోఆశ్చర్యపోయాడు.ఔషదపర్వతాన్ని, సుషేణుడియింటిని తెల్లవారేసరికి యధాస్ధానంలో ఉంచి వచ్చాడు హనుమంతుడు.