బజారు కెళ్ళర ఓబాబూ -- సత్యవాణి

బజారు కెళ్ళర ఓబాబూ
సరుకులు తేరా ఓ కన్నా
బజారు కెళతానోయమ్మా
సంచీ ఇవ్వవె మాయమ్మా
వెచ్చాలిచ్చేవ్యాపారీ
సంచిలొ సరకులు ఇచ్చునులే
పర్యావరణం పాడయ్యే
ప్లాస్తిక్ సంచితొ అతడిచ్చు
భూమికి ముప్పట ప్లాస్టిక్కూ
ప్లాష్టిక్ సంచులు వద్దమ్మా
గుడ్డ సంచులే ముద్దమ్మా