చదువు:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

బాలల్లారా చదవండోయ్
భవితకు మీరే వారసులోయ్
బంగరు భవితకు పునాదిగా
మీరే జాతికి ప్రధానము || బాల ||
దేవుడు కొలువై ఉండేది గుడిలో
బాలలు ఉండేది బడిలో
ప్రతి బడి ఒక దేవుడి గుడి
పాపలెగా  దేవుడి ప్రతిరూపాలు || బాల ||
మధురమైన మీ బాల్యమూ
కారాదు మరి వ్యర్థమూ
బడి అంటే భయమేమీలేదూ
అది మీ అమ్మ ఒడే కదూ || బాల ||
పలుగూ పారా విడిచిపెట్టి
పలకా బలపం చేతబట్టి
చదువులు ఎన్నో చదవాలీ
మనజాతికి ఖ్యాతి తేవాలీ || బాల ||