ఒక రెండు గంటల తరువాత కార్ శబ్దం వినిపించింది. మేము బయటకు పరుగెత్తాము . పిల్లలు కూడా కార్ దిగి గబా గబా మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. రాగానే అందరిని హాగ్ చేసుకున్నారు. వారిలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది .ఎక్కడికి వెళ్లారు అని అడిగితె గుక్క తిప్పుకోకుండా అన్ని పేర్లు చెప్పింది ఆద్య, అక్కడికి దూరం అంటూ ఆరియా రాగాలు తీసింది.చాలా రోజులు కనిపించక పోయే సరికి వారిలో ఏదో లోటు కనిపించింది. ఆరియా అందరి వద్దకు వెళ్లి హాగ్ కావాలి అని అడిగి తీసుకుంది.అవును ఒక స్పర్శ ఎంతో ఊరటను ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మన ఆప్యాయతను తెలియ చేస్తుంది.ఇద్దరు పిల్లలకు అందరిలో ఉండటమే అలవాటు. వారు ఒంటరిగా ఉండలేరు. అందరూ చుట్టూ కూర్చోవాలని, మాట్లాడాలని కోరుకుంటారు, అందరిని పలకరిస్తారు.అంతెందుకు ఎవరు ఫోన్ చేసినా వారితో మాట్లాడాలని కోరుకుంటారు. ఇంట్లో అందరికి అదే అలవాటు, వీరికి కూడా అదే వచ్చింది.(మిగతా ముచ్చట్లు రేపు )
' ఆ ' ఇద్దరు : - టి. వేదాంత సూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి