బ్రహ్మ
సగంలో విడిచిపెట్టిన చిత్రమే
వైకల్యం తప్ప
మరొకటి కాదు
ప్రేయసికి
కనురెప్పలా ఉండటంకన్నా
ఎందుకు
కళ్ళు కనిపించని వ్యక్తికి
రెప్పలైకాక
మార్గదర్శివై నడిపించేలా ఉండాలి....
నేతకు
కుడి చేయిగా ఉండటం
ఎందుకు?
చెయ్యి లేనివాడికి
కుడి చేయిగా ఉండటం
కనీస బాధ్యత
ఎవరికోసమో
మద్దతిస్తూ మాట్లాడటం దేనికీ?
నోరులేని వ్యక్తి
అనుభూతులను
అర్థం చేసుకుని మాట్లాడటం
మంచి మనసవుతుంది
ఎన్నో పార్టీల జెండాలు మోసే
నీ భుజాలు
ఓ కాలు లేని వ్యక్తినెందుకు
మోయకూడదు?
రాయితీలుగా ఇచ్చే డబ్బులు
వికలాంగుడికి చేసే సాయం కాబోదు
ప్రోత్సహిద్దాం
చైతన్యపరుద్దాం
నువ్వెవరికీ
తక్కువేమీ కాదని
చెప్దాం పదే పదే
రిజర్వేషన్ మాత్రమే
అతనికి దారి చూపే
కరుణైపోదు
అతనికి
హృదయంలో చోటిద్దాం
నువ్వెవరికీ
తక్కువేమీ కాదని
తెలిసేలా చేయందిద్దాం
రోడ్డు దాటడానికి
తోడ్పడటం
బస్సులో
కూర్చోవడానికి
సీటివ్వడం మాత్రమే
వికలాంగులకు
సాయం చేసినట్లయిపోదు
దేశంలో
సామాజిక న్యాయం
ఇంట సమానత్వం
వారికి లభించేలా చూడటంలోనే
ఉంటుంది గొప్ప మనస్సు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి