రెడ్ సిగ్నల్ :- ------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ .

ప్రజాస్వామ్యం 
పచ్చగా -
వర్ధిల్లుతోందని ,


అభివృద్ది ఆకాశాన్ని 
అంటుతోందని,


సెలవిచ్చే,
మహ గొప్ప -
నాయకుడి ,
నిలువెత్తు బొమ్మ 


దినపత్రికల్లో ,
ప్రకటన రూపంలో 
ప్రహసనంగా 
మారింది ....!


బొమ్మ చూసిన ఓటర్
ఇక ఎన్నికలెం దుకని,
చలి -పులిని ,
కరోనా ..రాక్షసిని 
వూహించుకుంటూ,
ఇంటికే....
పరిమితం అయ్యాడు !


తనిఖీకి వెళ్లిన-
అధికారిని చూసి,
బ్యాలెట్ బాక్సు ..
కిసుక్కున నవ్వింది !!