ఎక్కడో మూలకు నక్కి నిశ్శ బ్దంగా మీట నొక్కితే చాలు లక్ష్య సాధన దిశగా సాగిపోయే శరసంధానం
యుగాలకు సాక్షీ భూతమై
రహస్యాన్నింటినో దాచుకున్న గుట్టల గుండెలు పేల్చేసే యంత్ర భూతం!
నియామకానికి మెడలు వంచి ఆకాశానికి దూసుకు పోయే రాకెట్లకు రక్షణ జాకె ట్టయి రోదసీకి సాగడానికి భూమిక విజ్ఞాన తునక
సప్త సముద్రాల ఆవలి బాలనాగమ్మ ప్రాణ ఆచూకీ చెప్పే మాయల మరాఠీ
ఆధిపత్యాన్ని వారసత్వo గా పొంది అందరిని అదిరించే గ్రహణ పీడ తొలిగించే వెలుగు జాడ !
ఆడే తోలుబొమ్మ దారాన్ని
వేళ్ళ మధ్య సుతారంగా తిప్పుతూ ప్రజమెప్పును పొందే ఒప్పులకుప్ప !
మూడో ప్రపంచ యుద్ధ
శంఖారావానికి ఉపిరులూది సయోధ్య మంట కలిపి ఇంటి సభ్యుల మద్య నిప్పంటించి నిలబడి చూసే మోటు సరసి
దీనిని నొక్కకుంటే కారు డోరు తెరుచుకోదు కాలం సాగదు
మనసు మీట నొక్కకుంటే
కవిత్వం ప్రవహించదు
దేహాసముద్రం లో
తీపిబోట్లతో రక్తపోటును పెంచే రిమోట్
తళ తళ లాడే కాగితపు నోట్
అన్నింటినీ మించి న
ఏకైక రిమోట్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి