భాస్కర శతకము - పద్యం (౧౦౩ - 103)

  చంపకమాల: 
 *స్థిరతర ధర్మవర్తన బ్ర | సిద్ధికి నెక్కినవాని నొక్క ము*
*ష్క రుఁ డతి నీచవాక్యములఁ | గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం*
*గొరఁతవహింపఁడయ్యెడ, న | కుంఠిత పూర్ణ సుధాపయోధిలో*
*నరుగుచుఁ గాకి రెట్టయిడి | నందున నేమి కొరంత భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
దుర్మార్గుడు, చరిత్ర హీనుడు అయిన ఒక వ్యక్తి, ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలిగి, చక్కని మనస్సు వుండి, నలుగురి మనిషిగా మెలిగే మనిషి గురించి తప్పుగా, చెడుగా మాట్లాడితే ఈ మంచి మనిషికి ఏ విధమైన నష్టము, కష్టము కలుగదు.  ఎలాగంటే, చిక్కగా, వెన్నలా మెరుస్తున్న పాల సముద్రం మీద నుంచి వెళుతున్న కాకి, ఆ సముద్రంలో రెట్ట వేస్తే సముద్రానికి ఏమీ నష్టం జరుగదు కదా, అలాగ.....అని భాస్కర శతకకారుని వాక్కు
*మనిషిని గుర్తించడానికి మనకు కావలసింది, ఆ మనిషి మనస్తత్వం, ఉత్తమమైన వ్యక్తిత్వం, కానీ ఆ మనిషి సంపాదించిన ధనసంపత్తి కాకూడదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు