భాస్కర శతకము* - పద్యం (౧౦౪ - 104)

  చంపకమాల: 
 *సిరివలెనేని సింహ గుహ | చెంత వసించినఁజాలు సింహముల్*
*కరుల వధింపగా నచటఁ | గల్గును దంతచయంబు ముత్యముల్*
*హరువుగ నక్కబొక్కకడ | నాశ్రయమందిన నేమి గల్గెడుం*
*గొరిసెలుఁదూడతోకలును | గొమ్ములు నెమ్ములు గాక  భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
సంపద కావాలి అని కోరుకునే వారు సింహం గుహ దగ్ర కాపుకాసి వుంటే సరిపోతుంది.  సంహం మదించిన ఏనుగును చంపగా మిగిలిన ఏనుగు దంతాలు, ఏనుగు కుంభస్థలంలో వుండే ముత్యాలు దొరుకుతాయి. అలా కాకుండా, నక్క గుహల దగ్గర కాపు వుంటే గిట్టలు, దుడ తోకలు తప్ప విలువైనవి  ఏమీ దొరకవు .....అని భాస్కర శతకకారుని వాక్కు
*మనిషి తనకు ధన సంపద లేక గుణ సంపద ఏది కావాలనుకున్నా గొప్పవారిని కలవాలి తప్ప తక్కవ వారితో కలిసిన లాభం వుండదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు