అలంకరించబడింది.మెట్లెక్కుతూ లోపలకువెళ్ళేసరికి పూలతో అలంకరించబడిన రంగోలికనులపండుగ చేస్తూ కనిపించింది. ఆ రంగోలికిదగ్గరలోనే సంప్రదాయ సన్నాయి మేళంవారుకూర్చుని వీనుల విందుగా వాయిద్యాలు ఆహూతులకు వినిపిస్తున్నారు.రంగోలీకి ఎడమవైపు సాహిత్య అకాడమీ పుస్తకప్రదర్శన కనిపించింది.అక్కడ కొంతసేపు పుస్తకాలుచూసి ఆడిటోరియమ్ లోకి వెళ్ళడానికి వరండావైపు తిరిగాం. అక్కడ గోడకు అమర్చే కాన్వాస్‌మీద అకాడమీ అవార్డు తీసుకోబోతున్న 23 మంది రచయితల ఫోటో కార్డుబోర్డులు వేరువేరుగా పెట్టారు. రచయితలు కొందరు వారివారి ఫోటోలు వద్ద నిలబడి ఫోటో దిగడం చూసిమేము కూడా ఫోటో వద్దకు వెళ్లి ఫోటో దిగాం.ఆ తరువాత ఆడిటోరియమ్ లోకి వెళ్లి కూర్చున్నాం. డయాస్ వైపు చూశాను. చాలావిశాలంగా ఉంది.మొదటి వరుసలో నాలుగు కుర్చీలు మాత్రమే ఉన్నాయి. రెండవ వరుసలోరచయితల కోసం వేసే కుర్చీలున్నాయి.కుర్చీలకువేసిన క్లాత్ కవర్లకు కూర్చోవలసిన వారి పేర్లుఅతికించిఉన్నాయి. కుర్చీల వెనుక డయాస్వెడల్పున పెద్ద కాన్వాస్ ఉంది.కాన్వాస్ మీదఆంగ్లంలోను స్థానిక భాష తమిళంలోను సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార్ 2019 అనిపెద్ద అక్షరాలతో రాసి ఉంది. అంతలో చెన్నైలోనిఉంటున్న ప్రముఖ బాలసాహితీవేత్త డా.బెల్లంకొండ నాగేశ్వరరావు గారు మా కోసంవెతుకుతూ కనిపించారు.ఉదయమే ఫోన్ చేసివస్తున్నట్టు చెప్పారు. నేను నిలబడి చెయ్యిఊపగానే మా దగ్గరకు వచ్చారు. ఆత్మీయంగానన్ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.మేము మాట్లాడుతూ ఉండగా సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ కె.శ్రీనివాసరావు గారుఆడిటోరియమ్ లోకి ప్రవేశించారు.రచయితలనుపలకరించారు.మేమంతా మర్యాద పూర్వకంగానిలబడి నమస్కారం చేశాం.దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాను.ఆయన నవ్వుతూమీ తాతమాట వరాలమూట కథలు చాలాబాగున్నాయి. అన్ని కథలు చదివించాయి అన్నారు.ఇదే మాట కథల మాష్టారు,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కాళీపట్నంరామారావు గారు 2018 లో అన్నారు. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపాను.అక్కడ నుంచి ఆయన వెళ్ళారు.మా కుర్చీలలోకూర్చున్నాం. అంతలో మైక్ నుంచి మాటలువినిపించాయి.అటు చూశాం.వేదిక మీద అకాడమీ కార్యదర్శి పోడియం ముందు నిలబడి ఉన్నారు.(సశేషం)
239.బాలసాహిత్య పురస్కార్ 2019 ప్రదానోత్సవం(రెండవ భాగం):: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి