242. బాలసాహిత్య పురస్కార్2019 ప్రదానోత్సవం(ఐదవ భాగం): బెలగాం భీమేశ్వరరావు

 ఆ రోజు 2019 నవంబర్ 15 శుక్రవారం.ఉదయం
గం.9 కు అవార్డు గ్రహీత రచయితల సమావేశం
జరగబోయే భారతీయ విద్యాభవన్ లోని మినీ
హాలుకి రచయితలం  కుటుంబ సభ్యులతో
అకాడమీ వాహనాలలో చేరుకున్నాం.అక్కడ
సాహిత్య అకాడమీ అవార్డు చిహ్నం ఆ కిందన
దేవనాగరి లిపిలో సాహిత్య అకాడమీ అని ముద్రించిన బేగ్ అందించారు. అందులో రచయితల ప్రసంగ పాఠాల ప్రతులను పెట్టారు. బేగులందించిన దగ్గరే నిన్న ఫ్లెక్స్ చేసిన ఫోటోను కూడా ఇచ్చారు.అవన్నీ పట్టుకొని వచ్చి హాలులోని కుర్చీలలో కూర్చున్నాం.సమావేశానికి సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు శ్రీ మాధవ్ కౌశిక్ గారు  అధ్యక్షత వహించారు.ఆయన ఒకొక్క రచయితను పేరు పెట్టి పిలవగానే వేదిక మీద ఏర్పాటు చేసిన పోడియం వద్దకు వెళ్ళి రచయితలు  వారి వారి అనుభవ ప్రసంగ పాఠాలు ఆంగ్లం లేదా హిందీ లో వినిపిస్తున్నారు.పోడియం ముందు భాగంలో Ministry of culture, Government Of India అని ఉన్న బేనర్ వేలాడి ఉంది. నా వంతు వచ్చింది.పేరు పిలిచి వేదిక మీదకు రావలసినదిగా ఆహ్వానించారు.నా ప్రసంగ
పాఠం వినిపించడానికి వేదిక మీదకు వెళ్ళాను.
సభాధ్యక్షులకు సభకు నమస్కరించి నా ప్రసంగ
పాఠం వినిపించసాగాను."I am a son of a 
teacher, who used to say many stories
during my holidays.We had the big 
Bookshelf with piles of story books like
Pedarasi Peddamma Kathalu,Sahasra
Sirascheda Chintamani Kathalu,Kasi majili Kathalu,Bhatti Vikramarka Kathalu.Anyhow,the continuous listening
of stories has ignited the interest and 
even I too attracted towards literature.
I used to spend my holidays at Municipal
Library and Zilla Parishat Branch Library
with books instead of playing here and
there and attracted towards books,
Later reading became my hobby and it
has paved a path to write stories and
poetry.When I was in class 7th I got
association with well - known author,
Sri.Tallapudi Venkata Ramana who was
our Drawing Teacher . He wrote many
songs for children.We listened his songs
which were published in magazines. In
that time,I got a book on Gowtama Buddha which was presented for me
for getting good marks in class 6th.
I read that book many times.The book
which was written in easier way has 
attracted me more.I got an opportunity
to read many books during my idle
time after completion of my class 12.
The books which I read in those days
have influenced me to walk towards
literature and it has been continuing
even today.My first children song namely
"CHILUKA" means parrot was published
in 1979 when I was working as 1st Class
teacher at Parvathipuram Municipal
School.One day I found that my students
were staring at a parrot on the tree nearby our school while I was teaching
them alphabets. Soon after , I stopped
teaching and wrote a small poem on
Parrot and explained it to them in a rhythmic manner.I found that glow in the
faces of children while I was singing the
small song and I came to know that children are more enthusiastic towards
songs and stories. Later I started writing
for children in a rhythmic way(praasa)
with complete information.In that time
The year of 1979 was announced as International Children year by U.N.O
then Andhra Pradesh Baalala Academy
organised 8 days workshop at Nagarjuna
Sagar in the direction of Dr.Velaga 
Venkatappayya for the development of
children literature.I was selected for
the workshop and attended it.I learnt
a lot in that workshop.Prominent writers
Like Yedida Kameswararao,Turaga 
Janaki Rani,Dr.Mukurala Ramireddi and
Dr.Kolakaluri Inaq,K.Sabha and some
others used to visit our workshop and
delivered lectures.I acquired knowledge
over writing from the workshop but 
unfortunately ,after reaching home 
I came to know that my dad was no more.My book "Taata Maata - Vargala Moota" was selected for Kendra Sahitya
Akademi Bal Sahitya Puraskar 2019.
Actually prominent story writer and Kendra Sahitya Akademi Awardee Sri
Kalipatnam Rama Rao master read the
book and appreciated me a lot.It was
A great blessing for me and later the book was selected for this National
Award.Now a days children literature
has taken new turns and the writers are
required to take electronic gadgets
like mobile phones, computers as the 
material for their stories.Now the stories
on our Indian mythology and folk stories
are have good demand.The author should not write same story again and
again.The authors should focus on 
environment centric stories We should
tell the children about the importance
of protecting nature,land and environment.These subjects should be
emphasized and it's the responsibility
of authors.I wrote many novels and the
process is still continuing. I also wrote
some books on Natural farming which
are used to farmers and school's students.During those days,our grandparents used to make sit their
grandchildren in their lap and say many
stories but now the elders are simply
giving a smartphone to their younger
and asking them to play with those 
electronic devices.This type of habits
should be given up; the elders should
say stories to the children in their
own.Now a day the mind sets of people
is not pleasant, they have many personal
works , programs but they shouldn't 
ignore their children.If they do so,we definitely see the change in mind sets of
children. Some of the parents are witnessing the tremendous change in
their children after taking personnel
care and reciting stories. This is the real
change I am expecting among the
parents and children too.Thanking you all." ఇదండీ రచయితల సమావేశంలో నా 
ప్రసంగం. నా ప్రసంగం తరువాత ఉర్దూ రచయిత
మొహమ్మద్ ఖలీల్ గారి ప్రసంగమయింది.
అధ్యక్ష స్థానంలో ఉన్న మాధవ్ కౌశిక్ గారు ముగింపు వచనాలు పలికారు. రచయితల సమావేశం జాతీయ గీతం జనగణమనతో
ముగిసింది. ఆ తరువాత విందు అక్కడే జరిగింది.
విందు తరువాత బసకు చేరుకున్నాం.మర్నాడు
నవంబరు16 ఉదయం 10 గం.కు చెన్నై విమానాశ్రయం చేరాం.11గం.కు విమానం
బయలుదేరి హైదరాబాద్ మధ్యాహ్నం 12.15 ని.కు చేరింది. మేము మా అబ్బాయి ఇంటికి
వచ్చేసరికి మధ్యాహ్నం 1గం.దాటిపోయింది.
ఇదండీ  కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య
పురస్కార్ అందుకొనే వరకు నా బాలసాహిత్య
ప్రయాణం. డిశంబరు 3న మా మనవడికి సుముఖ్
నందన్ అని పేరు పెట్టాం.4వ తేదీన హైదరాబాద్
నుంచి ట్రైన్ లో బయలుదేరి 5వ తేదీ మధ్యాహ్నం పార్వతీపురం చేరుకున్నాం.బాలలు వర్ధిల్లాలి! బాలసాహిత్యం వర్ధిల్లాలి!!బాలసాహిత్య రచయితలు వర్ధిల్లాలి!!!  నా బాలసాహిత్య ప్రయాణం చదివిన పాఠకులలో ఏ ఒక్కరు కొత్తగా కలం పట్టినా నా ప్రయత్నం ఫలించినట్లే!కొత్తగా రాస్తున్నవారికి కొత్త  కొత్త ఆలోచనలకు ప్రేరణ
ఇవ్వగలిగితే నేను ధన్యుడినే!!(సమాప్తం) బెలగాం భీమేశ్వరరావు,9989537835.
                    కృతజ్ఞతలు
మీ అనుభవాలు రాసి మన మొలక న్యూస్ పత్రికకు పంపించండని కోరిన బాలల ప్రేమికులు, ప్రముఖ పాత్రికేయులు బాలసాహితీవేత్త శ్రీ తిరునగరి వేదాంత సూరి గారికి మరియు 2020 మే 18 తేదీ నుంచి సుమారు 8 నెలలపాటు నా బాలసాహిత్య ప్రయాణం చదివిన పాఠకదేవుళ్ళకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను.
                                        ఇట్లు
                            బెలగాం భీమేశ్వరరావు