అభిమానం: -యం.వీరవైష్ణవి.కొత్తపేట. 8వ తరగతి

 నరసింహాపురంలో సరళ అనే అమ్మాయి ఉం
డేది.సరళ ఏడవ తరగతి.ఆగ్రామానికి పొరుగునున్న కొత్తపేటకు నడిచివెళ్ళి చదువుకునేది.సరళ చాలా మంచిది.ఎలాగంటే అందరినీ గౌరవిస్తుంది.అణుకువగా ఉంటుంది.చదువులో తనకు తెలిసిన విషయాలు చెప్పి సాయపడుతుంది.చదవటంలో.ఆటపాటల్లో
చాలా కష్టపడుతుంది.మంచిమార్కులు
వచ్చినా గర్వంలేదు.సరళ వాళ్ళు పేదవాళ్ళు.ఆపాప అమ్మానాన్న పనికి పోతారు.
ఒకసారి ఆబడిలో విహారయాత్రకు పోవాలనుకున్నారు.విద్యార్థులు ఖర్చులకు
అవసరమైన డబ్బులు తెచ్చి ప్రధానోపాధ్యాయులకిచ్చారు.చివరి రోజు
వస్తున్నా సరళ డబ్బివ్వ లేదు.కారణమడిగితే ఇంట్లో డబ్బు
లేదు.నేను రావటం లేదంది.ఈ విషయం తెలిసి పిల్లలు,ఉపాధ్యాయులు డబ్బులేసుకుని విహారయాత్రకు తీసుకెళ్ళారు.
సరళ మంచితనం.కష్టపడి చదివేగుణం అంతమంది అభిమానించేలా చేశాయి.అలాంటి అభిమానమే మనిషికి
తరగనిధనం కదా!
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలోని కథ) 
కామెంట్‌లు