స్వార్థమే తన దేహ తపమనివ్యర్థ జీవులు మురుయు చుందురు
స్వార్థ మున కే స్థాన మివ్వక
సాగిపోరా భరతపుత్రుడ! 6
మట్టి గుండెల నుండి తీసే
మణుల ముద్దల వెనుక నిలిచిన
పేద రైతుల ఉక్కు కండలె
వెలుగు రేఖలు భరతపుత్రుడ! 7
ఏడురంగులు కలసి ఉంటనె
ఇంద్ర చాపము వెల్లి విరియును
మతము లన్నియు హితము పలికిన
మమతనిలుచును భరత పుత్రుడ! 8
భరత పుత్రుడా!-(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి