దేనికైనా నేడు రిమోట్ కంట్రోలర్.. !యాంత్రికతకు అదుపు యంత్రమే !బ్రహ్మాండమైన యంత్రాంగాన్ని సైతం.. .పిడికిలిలో ఇమిడే రిమోట్అదుపులో ఉంచుతూ.. !మానవమేధకు ఆకాశమే హద్దు!మరి మానవ జనిత దారుణాలకూ..ఏదైనా రిమోట్ఉంటే ఎంత మోదం !?చెట్టo త మగాడికి రిమోట్..భార్యామణి గొంతులోనో..కనుసైగలోనే,భృకుటి ముడిలోనో.. కదా !అల్లరి పిల్లలకు బామ్మల కథలేరిమోట్ లు !మామగార్ని పిండేస్తున్న అల్లుడునిఅదుపులో ఉంచే రిమోట్ బామ్మర్ది చేతిలో..విద్యాసంస్థల్లో కులం చీడకుకలెక్టర్ చేతిలో నిఘా రిమోట్!అటిటు నడిచే బొమ్మకారు కాదోయ్.. నేడు..ఆడపిల్ల తనకు తానే స్వయం రిమోట్ మిస్సైల్ !జర జాగ్రత్త !కవన కుతూహలంతో కాగితాలునలుపు చేస్తున్నా..పత్రికలూ, ప్రశంసముఖమెరుగని కవీంద్రా!కీర్తి రిమోట్ భావనల్లోనే ఉంది!భవ్య వర్ణనల భాగ్యం !ఉబ్బి తబ్బిబ్బయ్యే మెప్పులూవెండి కప్పులూ!కాశ్మీర్ శాలువాలూ.. !!మిత్రమా మీటనొక్కు మరి!
రిమోట్ కంట్రోలర్ - మనసు కూడా !: ---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి