జాతీయ బాలబాలికల దినోత్సవం:- కవిత వేంకటేశ్వర్లు


 బాలబాలికలు

తల్లి దండ్రులకు రెండు కళ్ళు

చీకటి లేని దీపాలు

కంటి కనుపాపలు

ఇంటి ఆణిముత్యాలు

కెంపు వజ్రాలు

ఇద్దరు ఉండాలి లోకానికి

బాధలు తీర్చే శోకానికి

ముదం నింపే మనసుకి

పదం పలికే జివ్హ్యాకి

ఆవేదనను తొలగించడానికి

ఆహ్లాదము కలిగించడానికి

కష్టాన్ని మరిపించడానికి

ఇష్టాన్ని తీర్చడానికి

బాలబాలికలు ఉండాలి ఇంటికి

వారే రేపటి పౌరులు దేశానికి

వారుండాలి ప్రతి కార్యానికి

పేరు ప్రతిష్టలు తేవాలి ప్రతి గృహానికి!!

               

కామెంట్‌లు