--మొహమ్మద్ .అఫ్సర వలీషాద్వారపూడి (తూ గో జి )

 బరువెక్కిన బాల్యం
అరవిరిసిన అందాలు
అరుణోదయ కాంతులు వెదజల్లు
అరమోడ్పు కన్నుల కలువలు
అలుపు సొలుపు లెరుగని
 సీతా కోక చిలుకలు ...
బడి తోనే మొదలవుతున్నది 
భారమైన బరువులు మోసే బాల్యం
భరత మాత ముద్దు బిడ్డల 
బుడి బుడి అడుగుల ప్రస్థానం ....
తల్లి ఒడిలో జోకొట్టాల్సిన బాల్యం
తల్లడిల్లుతూ భుజ భారాన్ని మోస్తూ 
తమునకలయ్యే చదువులతో 
తూనీగలై బస్సు లోన 
జోకొట్టాల్సి వస్తున్నది ....
 
 అ ఆ ఇ ఈ లతో
 చదువుల  పునాదుల
ఓనమాలు దిద్దేందుకు
ఆసన్నమైంది 
ఉత్సాహంగా బాల్యం  ....
బద్ధకం వీడింది
బాధ్యత తోడైంది ....
బస్సు కదులబోతోంది
 బాల్యాన్ని మోస్తూ
బాల్యం కదులు తోంది 
భుజాన బరువును మోస్తూ ...