ఇరుగుపొరుగు:--డాక్టర్ కందేపి రాణి ప్రసాద్


  ఒక పెద్ద చెరువు ఉన్నది ఆ చెరువు గట్టు మీద ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు మీద ఒక గద్ద కాపురముంటున్న ది గద్ద అంటే పక్షుల అన్నింటిలో కెల్లా పెద్దది దానికి వాడిగల ముక్కు ఉంటుంది నిశితమైన చూపు ఉంటది చాలా దూరాన ఉన్న వాటిని కూడా చూడగలరదు.

              ఆ చెట్టుకు దగ్గరలో ఉన్న పొదలో ఒక కోడి తన పిల్లలతో కాపురం ఉంటున్నది కోడి తన వెనకే జాగ్రత్తగా పిల్లలను తీసుకునేది తన పిల్లల్ని 100 కళ్లతో కాపలా కాసేది ఒకచోట కూర్చున్నప్పుడు కూడా తన రెక్కల కింద దాచుకునేది ఎవరికీ కనిపించకుండా అప్పుడు పిల్లలు ఉన్నట్లు ఎవరికీ కనిపించేవి కావు.

               చెట్టు మీద ఉన్న గత పొదలో ఉన్న కోడిపిల్లల్ని చూసింది కోడి కాస్త పరాకుగా ఉన్నప్పుడు కోడిపిల్లల్ని నోటకరచుకొని పారిపోయేది అలా అప్పుడప్పుడు కోడిపిల్లల్ని తినటం మొదలు పెట్టింది కోడి తన పిల్లలు ఎలా మాయమవుతున్నాయి మొదట్లో అర్థం కాలేదు తర్వాత దొంగచాటుగా గమనించింది  గద్ద తన పిల్లల్ని ఎత్తుకు పోవడం చూసింది

               కోడిగదద  దగ్గరకు వెళ్లి ఇలా అన్నది__మనం ఇరుగు పొరుగున ఉంటున్నాం మనం ఒకరికొకరు హాని చేసుకోకూడదు పైగా నువ్వు పక్షి వే నేను పక్షి మనం మనం స్నేహం గా ఉండాలి ఇలా ఎప్పుడూ చేయకు అన్నది కోడి.

              ఆమాటలకు గద్ద పొగరుగా నవ్వింది నువ్వు పక్షి ఏమిటి ఏదో ఇల్లు ఎక్కేదాకా ఎగరగలవు అంతే కదా ఆకాశంలో దూసుకుపోయే నేనెక్కడ ఏదో ఇల్లు పై దాకా ఎగిరే నువ్వెక్కడ ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను తినేస్తా అన్నది అహంకారంగా గద్ద.

              కోడి ఏం మాట్లాడ కుండా వెళ్ళిపోయింది ఊర్లోకి వెళ్లి కాలుతున్న పొయ్యిలో నుంచి ఒక పుల్లను తీసుకుంది మండే పుల్లను తీసుకువెళ్లి చెట్టు మీదకు ఎగిరింది చూడు గదాద , నేను చిన్న పక్షి అన్నావు కదా చూడు నువ్వు నా పిల్లల్ని తినటం ఆపకపోతే నేను ఊరుకోను ఈ మంట పుల్లను నీ గూటోల ఉన్న నీ పిల్లల మీద మీద వేసేస్తా . గూటిలో లో  లో ఉన్న నీ పిల్లలని మాడి మసైపోతాయి. అన్నది వీరావేశంతో కోడి.

             గద్ద ఆలోచించింది డ్యూటీ లో తన పిల్లలు ఇంకా కళ్ళు తెరవలేదు ఇంత త్వరగా వాటిని వేరే గుడ్ లోకి మార్చడం కష్టమే తను ఎంత పెద్ద పక్షి అయినప్పటికీ. అందుకే కోడితో శాంతి ఒప్పందానికి వచ్చింది నువ్వు నా పిల్లలకు హాని చేయకు నేను నీ పిల్లలకు హాని చెయ్యను ఇరుగు పొరుగుల మనం కలిసి మెలిసి ఉందాం అన్నది గద్ద. అప్పటినుంచి గద్ద కోడి కలిసిమెలసి జీవించసాగారు.


కామెంట్‌లు