గోడ:--సి.యస్.రాంబాబు


 పువ్వులను పలకరించాను 

పుడమి పులకరించింది 

నవ్వులను వెదజల్లాను 

అనుమానం మొలకలేసింది 


గాలిని పలకరించాను

గాఢంగా హత్తుకుంది 

మనిషికై చేయి సాచాను 

అడ్డుగోడ ఆపేసింది 


చెట్టును పలకరించాను 

నాలుగు పూలను రాల్చింది 

మళ్ళీ మనిషికై వెతికాను 

ఈసారి గోడ నాచుట్టూ మొలిచింది