పోలియో చుక్కలు : -- డా. కందేపి రాణి ప్రసాద్


 మురిపాల ఈ పాప ముద్దుగా ఉన్నది

 బంగారు ఈ బాబు బంతిలాగున్నాడు

చూసి మురిసిపోవె చెల్లెమ్మా

చూడ చక్కగ నున్నారమ్మా


మిల మిల మెరిసే కళ్ళు

నిగనిగలాడే ఒళ్ళు

ముత్యాల పలుకులు

నయగారాల నడకలు

ఏ పాలు పట్టినావె చెల్లెమ్మా!

ఏమేమిచ్చినవో చెప్పమ్మా!


తల్లి పాలే పట్టినానమ్మ!

దాని కేధీ సాటిలేదమ్మ!

పోలియో చుక్కలేయిస్తినమ్మ!

రోగలే దరికి రావమ్మ!