పోరాడుదాం రండి: : యడ్ల శ్రీనివాసరావుMSw,MTel: విజయనగరం జిల్లా
 నరాలు సంధించు
ఉక్కు పిడికిలి మోగించు
యువతరం ముందుకు రండి
నవశకం మనదే నండి
పోరాడితే పోయేది ఏమీ
ఆలోచనతో నడు ముందు
ఎర్రసైన్యం
యువత భవితను
పోలిన నవతరం
ముందుకు దూసుకు పోదాము
రండి ..రండి.. రండి...
భూస్వాముల
కోట పేటలు
కూల్చేద్దాం
నిరుపేదల
బానిసత్వం తీరు
అంతం చేద్దాం
రండిరండి ...చెల్లెలారా...
రండిరండి ...తమ్ముల్లారా...
రండి రండి ...అన్నయ్యలారా...
అగ్నిపర్వతాలు లావ వల్లే
సముద్ర కెరటాలు వలె 
అణచి పోక
సమీసి పోక
ఎర్రని నెత్తుటి బావుటా అర్థం
వందేమాతరం.

కామెంట్‌లు