గుడ్మార్నింగ్ (139 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 ఆత్మశుద్ది గురించి ఆధ్యాత్మిక వాదులు ప్రచారం చేస్తుంటారు! ఆత్మ అంటే మనసు! మనసును శుద్ది చేసుకోవడం గురించి చెప్తూ ఉంటారు!ఎప్పటికప్పుడు మనసును శుద్ది చేసుకుంటూ ఉంటే,జీవితం సజావుగా జరగుతుందని,మీరు ఏది సాధించాలన్నా మీ మనసు దాని మీద పూర్తిగా లగ్నం కావాల్సి ఉండవలసి ఉంటుందని,అందుకు పరిశుద్దమైన మనసు కావాల్సిన అవసరం ఉంటుందని చెప్తుంటారు. అది నిజమే!
ఏది సాధించాలన్నా,మనసు కూడా శుభ్రంగా ఉండాలి!
మరో ఆలోచన ఉండకూడదు.
శుద్ది అంటే శుభ్రం చేసుకోవడం అన్నమాట! మనసును ఎలా శుభ్రం చేసుకుంటారు? అదేమైనా వస్తువా నీళ్లతో సబ్బులతో కడగడానికి? పోనీ శరీరం కూడా కాదాయే స్నానం చేసి శుభ్రం చేసుకోవడానికి! శరీర శుభ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు- కొందరు పొద్దు మాపు స్నానాలు కూడా వివిధ రకాలైన సువాసన కలిగిన సబ్బులతో రాసి రాసి కడిగి శుభ్రం చేస్తుంటారు!
కాని మనసును ఎలా కడగడం?అది మనసాయే! దానికి ఓ రూపం రంగు వగైరా లేవాయే? కనపడదాయే? మరి ఎలా శుభ్రం చేసుకోవడం?మరేమీ లేదు! మనం ఎప్పటికప్పుడు మన మనసుల్లోంచి చెడు ఆలోచనలను బయటకు సాగనంపాలి,మంచి ఆలోచనలను లోపలికి ఆహ్వానించాలి! అంతే! నిజానికి చాలా చిన్న విషయం!
అయితే అదంతా తేలికైన విషయం కూడా కాదు!
మనసును సాధించాడానికి , శరీరమే ముఖ్యమైన సాధనం!
మరి ఆ శరీరం మాటేమిటి?
మనం మన మనసును శుభ్రం చేసుకుంటే సరిపోదు! అలాగని శరీరాన్ని పైన పైన శుభ్రం చేసుకుంటే సరిపోదు!
వ్యాధిగ్రస్త శరీరంలో, ఆరోగ్యకరమైన ఆత్మ ఉండదు!
అసాధ్యం! మరెలా?
మన మనసు బాగుండాలి అంటే, మన శరీరం కూడా బాగుండాలి!శరీర ఆరోగ్యం దాని అంతర్గత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది!శరీర అంతర్గత ఆరోగ్యం అంటే? జీర్ణ విసర్జన వ్యవస్ధ శుభ్రత గురించి అన్నమాట!
ఏపూటకు ఆపూట విసర్జనలు సాజావుగా సాగేలా ఆలోచించాలి- చర్యలు తీసుకోవాలి.
శరీర అంతర్గత శుద్ది- ప్రకృతి జీవనవిధానంలో చెప్తుంటారు కద? అదీ! శరీరాన్ని లోపల శుభ్రం చేసుకోవడం- అంటే విసర్జన వ్యవస్థ ఏపూటకు ఆపూట సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలి.కడుపులో మలం నిల్వ ఉన్న వారికి,ఒంట్లో అనారోగ్యం నిల్వ ఉంటుంది. అప్పుడు మనం మన మనసును శుభ్రంగా ఉంచుకోవడం మీద శ్రద్ద పెట్టలేం- మనసుని ఏ విషయం మీదా లగ్నం చెయ్యలేం,దేన్నీ సరిగా సాధించలేం!
ప్రేవుల నిండా మలం ఉన్న వారి శరీరం కూడా ,చెమట దుర్వాసన వేస్తుంది. రోజుకు రెండు స్నానాలు చేసినా, ఖరీదైన సబ్బులు అరగదీసినా,ఆ దుర్వాసన పోదు! ఏపూటకు ఆపూట మలవిసర్జన సాఫీగా జరిగేలా చూసుకోవాలి. అప్పుడే శరీరం శుభ్రంగా ఉంటుంది.మనసూ శుభ్రంగా ఉంటుంది.
శుభ్రమైన శరీరంలోనే ,శుభ్రమైన ఆత్మ ఉంటుంది!
ఆత్మశుద్దికి కూడా, ఆరోగ్యవంతమైన శరీరం కావాలి.
మనం మన ఆత్మశుద్దిని సాధించాలంటే, ముందుగా శరీర అంతర్గత శుద్దిని సాధించాలి!
కామెంట్‌లు