శ్రీ కృష్ణ శతకము - పద్యం (౧౭ - 17)

 కందము :
*మడుగుకు జని కాళీయుని*
*పడగలపై భరతశాస్త్ర | పద్ధతి వెలయన్*
*గడు వేడుకతో నాడెడు*
*నడుగులు నా మదిని దలఁతు | నచ్యుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
కృష్ణా, కాళీయుడు అనే పాము ఆసరస్సుకు వచ్చిన వారిని అందరిని తన విషం చల్లి చంపేస్తున్నాడు.  ఆ మడుగుకు వెళ్ళి, నీవు ఆ కాళీయుని పడగలపై నీ పాదాలతో అద్భుతంగా భరతనాట్యం పద్ధతులు చూపించావు. అటువంటి నీ పాదాలను నా మనస్సులో ధ్యానించి నమస్కరిస్తున్నాను.......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*కాళీయ ఫణి ఫణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గపకిశోరా* అంటూ ఆ అమేయాత్మని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss