శ్రీ కృష్ణ శతకము - పద్యం (౧౮ - 18)

 కందము :
*బృందావనమున బ్రహ్మా*
*నందార్భకమూర్తి వేణు | నాదము నీ వా*
*మందార మూలమున గో*
*విందా పూరింతువౌర | వేడుక కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
కృష్ణా, నీ చిన్నతంనంలో, బృందావనములో  మందార వృక్షము దగ్గర  కూర్చుని, అందరికీ ఆనందాన్ని పంచుతూ, ఆహ్లాదకరంగా, మనసులను ఉత్తేజ పరిచే విధంగా, వేణువు వూదుతూ వుండేవాడివి .......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*కృష్ణా, నీ వేణు గాన మహిమ వర్ణించడం ఎవరి తరమౌతుంది.  నీ మురళీ రవం విని గోపికలు మై మరచి పోయేవారు. ఆవులు, గేదెలు పితక కుండానే పాలు ఇచ్చేవి. పని పాటులు చేసుకునే గోప జనులకు అలసట తెలిసేది కాదు. ఎన్ని చెప్పాలి, ఎలా చెప్పాలి. "మధురం! మధురం! అధరం మధురం!! అధరము సోకిన వేణువు మధురం!!"* అంటూ ఆ నందనందనుని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss