కందేపి రాణిప్రసాద్ కు డా.వాసరవేణి బాలసాహిత్య పరిశోధక పురస్కారం2020

 బాల్యం నుండే ఉత్తమ బాలసాహిత్యం అందించినప్పుడు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారనీ బాల సాహిత్యం రచనలతో పాటుగా పరిశోధనలు అధికంగా రావాలని వాసరవేణి బాలసాహిత్య పరిశోధక పురస్కా గ్రహీత డా.కందేపి రాణిప్రసాద్ గారన్నారు.
తేదీ 05-01-2021 రోజున తెలంగాణ వివేక రచయితల సంఘం & వాసరవేణి లక్ష్మీ నర్సయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలసాహిత్య రంగంలో పరిశోధనలో అందిస్తున్న "డా.వాసరవేణి పరశురాం బాలసాహిత్య  పరిశోధన పురస్కారం 2020" ను డా.కందేపి రాణిప్రసాద్ గారికి అందించారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత కందేపి రాణిప్రసాద్ గారు మాట్లాడుతూ బాలసాహిత్యం బాలల మనస్సులాంటి దనీ,బాల్యంలో మంచి బాలసాహిత్యం అందించాలనీ బాలసాహిత్యంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , నాగార్జున విశ్వవిద్యాలయంలో "బాలసాహిత్యంలో -సైన్స్" అను అంశంపై పరిశోధన చేసాననీ, పరిశోధనలో చాలా కష్టపడ్డాననీ వాసరవేణి బాలసాహిత్య పరిశోధక పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పురస్కార కమిటీ చైర్మన్ & తెలంగాణ వివేక రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ బాలసాహిత్యం రచనలో పురస్కారాలు అందిస్తున్నప్పటికీ, బాలసాహిత్య పరిశోధన రంగంలో పురస్కారాలు ఇస్తున్న దాకలాలు ఎక్కడా కనపడటం లేదని,బాలసాహిత్య పరిశోధకులకు "డా.వాసరవేణి పరశురాం బాలసాహిత్య పరిశోధక పురస్కారం అందించడం బాలసాహిత్యంలో పరిశోధనలో ప్రోత్సహించడమే అవుతుందనీ వయస్సులో చిన్నవాడైన పరశురాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "ఈ దశాబ్ది (2001-2010) - బాలసాహిత్యం ఒక పరిశీలన" అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారనీ,జాతీయ స్తాయిలో బాలసాహిత్య పరశోధకులు కొద్దిమందిలో తానొకరనీ, 12 సంవత్సరాల వయస్సునుండే 30 సంవత్సరాలుగా బాలసాహిత్యం రాస్తున్నారనీ, బాలసాహిత్యం ఆయన ప్రాణమనీ అవార్డు ఇవ్వడం గొప్ప విషయమనీ కందేపిగారు అన్నివిధాలా అర్హురాలనీ  అభినందనీయమన్నారు.
వాసరవేణి లక్ష్మీ నర్సయ్య ఫౌండేషన్ & తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసరవేణి పరశురాం మాట్లాడుతూ సాహిత్యంలో పెద్దలకు ఎన్ని ప్రక్రియల్లో రాయవచ్చో పిల్లలకు అన్ని ప్రక్రయల్లో రాయవచ్చన్నారు పెద్దలకు రాసిదే సాహిత్యం అనీ పిల్లలకు రాసేది సాహిత్యం కాదన్నట్లుగా కొందరు చూస్తున్నారనీ బాలసాహిత్యంపై వివక్ష తగదనీ ,బాలసాహిత్యంలో ప్రోత్సహించాలనీ అవార్డులు ఇవ్వాలన్నారు.అలాగే కందేపి రాణిప్రసాద్ గారు పిల్లల కోసం పూలతోట మొదలకుని 40కి పైగా  వివిధ ప్రక్రియల్లో రచనలు చేసారనీ రెండవ వాసరవేణి బాలసాహిత్య పరిశోధకపురస్కారం ఎంపిక అయినందులకు,ఎంపిక చేసిన కమిటీకీ ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు తొలి పురస్కారం డా.వి.ఆర్. శర్మగారు అందుకున్నట్లు ఇలాగే బాలసాహిత్యపరిశోధకులకు అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ తెలుగు భాషాసంఘం అధ్యక్షుడు కందాల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ బాలసాహిత్య పరిశోధన రంగంలో పరిశోధకుల 5116/రూపాయలతో పురస్కారం ఇవ్వడం చిన్న విషయం కాదని అభినందనీయమన్నారు. కమిటీ కన్వీనర్ వాసరవేణి రాజు,కవులు పెరమాండ్ల రాజయ్య, దుంపెన రమేష్, బూరదేవానందం,ఫణి లక్ష్మణ్,శివాలభక్తర్,వాసరవేణి దేవరాజు వెంగల లక్ష్మణ్,కిరణ్ కుమార్,రాజశేఖర్, రవి, తదితరులు పాల్గొన్నారు.