చీకటిని తరిమేది వెలుగులను పంచేదికాంతులను వెదజల్లి కరిగిపోయేదిది
మనుజులకు మార్గమని మాన్యులు చెప్పేది
ఏమిటై ఉంటుంది?చిరుదివ్వలారా
ఒకనాటి వాసులకు ఆధార సౌధము
ఖర్చు ఎక్కువ రాదు కరంటుతో పనిలేదు
ఇల్లంత దిద్దిచ్చు కొంత సమయమునందె
కొండంత అండయని సామెతగ చెబుతారు
చూడ చక్కని కాంతి సువర్ణమై మెరియును
తైలమ్ము ఏదైన తర్కించ బోదట
తనపేరుతో ఉన్న పర్వదినమేమిటో
చెప్పండి ఎవరైన చిన్నారులారా
ముట్టుకుంటే చాలు చురుకులను అంటించు
గాలిదేవుడంటె గడియైన పడదనును
తాను వస్తానంటె నేను పోతాననును
విడమరిచి చెప్పండి విద్యార్థులారా
బాలగేయం: -మమత ఐల--హైదరాబాద్-9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి