వందనాలు వందనాలు
రైతన్నా వందనాలు
నిరంతరం శ్రమించే
కూలన్న వందనాలు
తనకున్నా లేకున్నా
ఇతరులకై రేయి పగలు
పంటలు పండించేటి
అన్నదాత వందనాలు
తుఫాన్లు వరదలను
విపత్తులను ఎదిరించి
అలుపెరగక కష్టించే
త్యాగమూర్తి వందనాలు
రెక్కలు ముక్కలు చేసి
చెమటలను చిందించి
మట్టికి ప్రాణం పోసే
ప్రాణదాత వందనాలు
పండిన పంటకు ధర
గిట్టుబాటు కాకున్నా
సేద్యం కొనసాగించే
ధన్యమూర్తి వందనాలు
వందనాలు : -రావిపల్లి వాసుదేవరావు 9441713136
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి